Viral News: భార్యా.. భర్త.. మధ్యలో చేప.. మొగుడిపై కోపంతో మరీ ఇలా చేయడమేంటి..!

ABN , First Publish Date - 2021-10-10T01:31:45+05:30 IST

భర్తల మీద కోపాన్ని పలు రకాలుగా ప్రదర్శిస్తుంటారు ఆడవాళ్లు. కొందరైతే భర్తను ఏమీ అనలేక పిల్లలను హింసిస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. అయితే ఓ మహిళ మాత్రం చాలా విచిత్రంగా ఉన్నట్టుంది.

Viral News: భార్యా.. భర్త.. మధ్యలో చేప.. మొగుడిపై కోపంతో మరీ ఇలా చేయడమేంటి..!

సంసారం అన్నాక సవాలక్ష ఉంటాయన్నది.. అందరికీ తెలిసిందే. అత్త మీద కోపం దుత్త మీద చూపించిన చందంగా.. ఒక్కోసారి భర్తల మీద కోపాన్ని పలు రకాలుగా ప్రదర్శిస్తుంటారు ఆడవాళ్లు. కొందరైతే భర్తను ఏమీ అనలేక పిల్లలను హింసిస్తుంటారు. ఇలాంటి  ఘటనలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. అయితే ఓ మహిళ మాత్రం చాలా విచిత్రంగా ఉన్నట్టుంది. తన భర్త మాట వినలేదని.. తన కోపాన్ని సరికొత్తగా చూపించి.. గుణపాఠం నేర్పింది. మొగున్ని ఏమీ అనలేదు.. కానీ అతని మీద పగ తీర్చుకుంది. ఆమె చేసిన ఆ చిన్న పని.. కాపురంలో చిచ్చు పెట్టే వరకూ వచ్చింది. అదేంటంటే.. 


మియా కుర్నియావన్ అనే మహిళ.. తన భర్తను రోజూ ట్యాంక్ శుభ్రం చేయమని చెప్పేది. అయితే వివిధ కారణాలతో అతను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు. అయినా ఆమె రోజూ పదే పదే.. అదే పని చేయమని గుర్తు చేస్తూ ఉండేది. దీంతో విసుక్కున్న భర్త.. చేయనని తేల్చి చెప్పాడు. దీంతో మొగుడిపై కోపం పెంచుకుంది. ఎలాగైనా గుణపాఠం నేర్పించాలనుకుంది. కానీ ఎలా నేర్పించాలనే విషయంపై వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు తనకు ఓ ఐడియా వచ్చింది. ఓ చేపను తన భర్త.. ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్నాడు. భార్య చెప్పిన పనుల కంటే చేపను బాగా చూసుకోవడంలోనే నిమగ్నమయ్యేవాడు. దీంతో ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది.


ముందుగా సెల్‌ఫోన్ తీసుకుని వీడియో ఆన్ చేసింది. స్టౌవ్ వెలిగించి.. నూనె వేడి చేసింది. తన భర్త ఇష్టంగా పెంచుకుంటున్న చేపను తీసుకుని, అందులో మసాలా కుక్కి.. నూనెలో వేయించింది. భర్త మీద కోపాన్ని మొత్తం చేప మీద చూపిస్తూ చివరకు దాన్ని ఫ్రై చేసేసింది. తన కోపం చల్లారాక.. ఆ వీడియోను టిక్‌టాక్‌లో పోస్టు చేసింది. దీంతో తెగ వైరల్ అయింది. ఎంతో ఇష్టంగా చూసుకున్న చేపను అలా చేయడంతో ఆమె భర్త చాలా బాధపడ్డాడు. అయితే వీడియో వైరల్ అవడంతో భార్య మాట మార్చింది. చేపకు అనారోగ్యంగా ఉండడంతో ఫ్రై చేశానని కూల్‌గా చెప్పేసింది. అయినా దీన్ని జీర్ణించుకోలేని ఆ భర్త.. భార్యపై కోపం పెంచుకునే పరిస్థితికి దారితీసింది. 

Updated Date - 2021-10-10T01:31:45+05:30 IST