భర్తకు తలకొరివి పెట్టిన భార్య

ABN , First Publish Date - 2021-06-16T05:12:32+05:30 IST

భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన టెక్కలి పట్ట ణంలో మంగళవారం చోటు చేసుకుంది.

భర్తకు తలకొరివి పెట్టిన భార్య
భర్త మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్న మణిమాలతి

టెక్కలి రూరల్‌: భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన టెక్కలి పట్ట ణంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక శంభాన వీధికి చెందిన టైలర్‌ పాసి వెంకట రమణ(53) కిడ్నీ వ్యాధితో సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు తప్ప కుమారులు లేరు. దీంతో భార్య మణిమాలతి భర్తకు అంత్యక్రి యలు నిర్వహించింది. స్థానికుల సాయంతో వెంకటరమణ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి దహన సంస్కారాలను పూర్తిచేసింది.

 

Updated Date - 2021-06-16T05:12:32+05:30 IST