ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని..

Published: Thu, 18 Aug 2022 21:05:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని.. ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులమతాలు (Caste religions) వేరైనా కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే వివాహం చేసుకుని సంతోషంగా  ఉండేవారు. అయితే 16సంవత్సరాల తర్వాత వారి కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. ఆరు నెలల క్రితం ఉన్నట్టుండి భర్త అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య సమస్యలు తలెత్తాయి. ఇటీవల ఓ రోజు చెల్లెలు ఇంటికి వెళ్తున్నానని చెప్పి.. చివరకు భార్య ఏం చేసిందంటే..

హర్యానా (Haryana) రాష్ట్రం అంబాలా జిల్లా కాంట్‌లోని తారా నగర్‌లో నివాసం ఉంటున్న ముస్లిం వ్యక్తి.. 16ఏళ్ల క్రితం యూపీలోని బిజ్నోర్ జిల్లా మన్సూర్ సరాయ్ సయోహరాకు చెందిన హిందూ యువతిని ప్రేమించి పెళ్లి (love marriage) చేసుకున్నాడు. కులమతాలు వేరైనా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదిలావుండగా, ఆరు నెలల క్రితం భర్త సడన్‌గా అస్వస్థతకు (Illness) గురయ్యాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 9న.. భార్య తన చెల్లెలి ఇంటికి వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే తర్వాత విచారిస్తే.. ఆమె అక్కడికి వెళ్లలేదు.

అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..

దీంతో కంగారు పడిన భర్త.. తెలిసిన వారి వద్ద విచారించాడు. అయినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తాను ముస్లిం అయినా.. తన భార్యకు ఎప్పుడూ బురఖా ధరించడం వంటి నిబంధనలు (Terms) విధించలేదని చెప్పాడు. ఐదు నెలల క్రితం కూడా తనకు చెప్పకుండా వెళ్లిన భార్య.. కొన్నాళ్లకు తిరిగి వచ్చిందన్నాడు. తల్లి ఎక్కడికి వెళ్లిందంటూ పిల్లలు అడుగుతుంటే.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదని.. భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ కోసం గాలిస్తున్నారు.

గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..Honor Killing: కన్న కూతురిని చంపి నడిరోడ్డుపై పారేసిన తండ్రి.. శవం ఎవరిదో గుర్తు పట్టకూడదని తలను నరికి..విధిరాత అంటే ఇదేనేమో.. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ఈ యువకుడు ఎవరో, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే..Viral photo: చెట్లే తన ఆవాసం.. రాత్రిళ్లు రంగు రంగు బొమ్మలతో సావాసం.. అంతా కూతురి కోసమే అంటున్న తండ్రి.. భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..ఇన్నాళ్లూ.. తమ కూతురు కాలుజారి కాలువలో పడిందనుకున్నారు.. కానీ ఇంట్లో పరుపు శుభ్రం చేస్తుండగా.. బయటపడిన పేపర్‌తో..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.