లేగదూడను చంపిన అడవి జంతువు

ABN , First Publish Date - 2021-04-24T04:55:53+05:30 IST

గుర్తు తెలియని ఓ అడవి జంతువు దాడి చేయడంతో లేగదూడ మృతి చెందింది.

లేగదూడను చంపిన అడవి జంతువు
పాద ముద్రలను పరిశీలిస్తున్న పారెస్ట్‌ అధికారులు

ఖిల్లాఘణపురం, 23; గుర్తు తెలియని ఓ అడవి జంతువు దాడి చేయడంతో లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన మం డల పరిధిలోని పర్వతాపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గ్రామస్థులు, రైతులు తెలిపిన వి వరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్యాట బాలస్వామి ఎ ప్పటిలాగనే గురువారం రాత్రి కూడా పశువులను పొలం దగ్గరే కట్టేసి ఇంటికొచ్చారు. శుక్రవారం తెల్లవారు జామున గు ర్తు తెలియని, ఓ అడవి జంతువు,  లేగదూడపై దాడి చేసిం ది. ఉదయం బాలస్వామి కుమారుడు ప్యాట శ్రీను పొలం ద గ్గర కెళ్లి చూడగా లేగదూడ రక్తపు మడుగులో కనిపించింది. భయబ్రాంతులకు గురైన శ్రీను గ్రామస్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు.  గ్రామస్థులు  సంఘటన స్థలానికి చేరుకు ని పరిశీలించగా పులి పాదాల వలే పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించాయి.  పెద్దపులి అయ్యి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నాగేంద్రం, సిబ్బంది ఆంజనేయులుతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లేగదూడను చంపి తిన్న విధానం, దాని పాదముద్రల ఆధారంగా  హైనా అయ్యి ఉండ వచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పంచనామ నిర్వహించా రు.  కార్యక్రమంలో వీఆర్‌ఓలు లక్ష్మయ్య, సుదర్శ న్‌, రైతులు, గ్రామస్థులు ఉన్నారు.

Updated Date - 2021-04-24T04:55:53+05:30 IST