బాత్రూంలో స్నానం చేస్తున్న మహిళ.. షవర్ వద్ద కనిపించిందో చిన్న వస్తువు.. అదేంటా అని పరిశీలనగా చూసి షాక్..!

ABN , First Publish Date - 2021-11-03T22:44:03+05:30 IST

యూకేలో ఓ మహిళ స్నానం చేయడానికి బాత్రూంకు వెళ్లింది. స్నానం చేస్తుండగా షవర్ వద్ద కనిపించిన వస్తువును చూసింది. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయింది. వివరాల్లోకి వెళితే..

బాత్రూంలో స్నానం చేస్తున్న మహిళ.. షవర్ వద్ద కనిపించిందో చిన్న వస్తువు.. అదేంటా అని పరిశీలనగా చూసి షాక్..!

కొందరు తమ వృత్తి పట్ల అంకితభావంతో ఉంటారు. వృత్తే దైవంగా భావిస్తారు. కానీ మరి కొందరు మాత్రం తమ పని తాము చేస్తున్నట్లుగా నటిస్తూ.. చేయరాని పనులన్నీ చేస్తుంటారు. పైకి అమాయకంగా ఉన్నారు కదా అని నమ్మితే.. చివరికి దారుణానికి ఒడిగడతారు. ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. యూకేలో ఓ మహిళ స్నానం చేయడానికి బాత్రూంకు వెళ్లింది. స్నానం చేస్తుండగా షవర్ వద్ద కనిపించిన వస్తువును చూసింది. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయింది. వివరాల్లోకి వెళితే..


యూకేలోని నాటింగ్‌హామ్‌లో ఓ మహిళ బాత్రూంలో మరమ్మతు పనులు ఉంటే.. ప్లంబర్‌ను పిలిచింది. అక్కడికి వచ్చిన జేమ్స్ హుల్మ్(57) అనే ప్లంబర్.. మరమ్మతు పనులన్నీ చేసేశాడు. తర్వాత తనకు రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం మహిళ స్నానానికి వెళ్లింది. అయితే తీరా స్నానం చేస్తుండగా.. షవర్ వద్ద ఏదో వస్తువు ఉన్నట్లు గమనించింది. అనుమానం రావడంతో దగ్గరికి వెళ్లి చూస్తే.. సీసీ కెమెరా బయటపడింది. తన బాత్రూంలో సీసీ కెమెరా ఏంటీ.. అనుకుని భయపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ కెమరాను స్వాధీనం చేసుకుని మహిళను విచారించగా.. మరమ్మతు పనుల గురించి చెప్పింది. దీంతో ప్లంబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


అనంతరం ప్లంబర్ ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ వారికి దొరికిన వీడియోలు చూసి షాక్ అయ్యారు. మరమ్మతు పనులు చేసేందుకు వెళ్లే సమయంలో బాత్రూంలలో సీసీ కెమెరాలు అమర్చి.. తద్వారా వీడియోలన్నింటీ సేకరిస్తుంటాడని తెలుసుకున్నారు. ఇలా చాలా ఇళ్లలోని బాత్రూంలలో కెమెరాలు అమర్చినట్లు అంగీకరించాడు. అతడి కంప్యూటర్‌ను పరిశీలించగా.. 302 మంది చిన్నారులు, యువతులు, మహిళల అశ్లీల ఫొటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ ఘటన 2018లో సంచలనం కలిగించింది.

Updated Date - 2021-11-03T22:44:03+05:30 IST