వారు చేసిన ఒకే ఒక తప్పుతో.. ఆ మహిళ ఫోన్‌కు రోజూ 4,500 కాల్స్.. ఏంటిది అని విచారించగా..

ABN , First Publish Date - 2021-12-24T03:24:17+05:30 IST

ఓ మహిళకు రోజూ ఏకంగా 4500 ఫోన్లు రావడం మొదలెట్టాయి. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందులకు గురైంది. చివరకు అసలు విషయం తెలిసి షాక్‌కు గురైంది..

వారు చేసిన ఒకే ఒక తప్పుతో.. ఆ మహిళ ఫోన్‌కు రోజూ 4,500 కాల్స్.. ఏంటిది అని విచారించగా..

ఒక్కోసారి చిన్న చిన్న తప్పులే.. చివరకు పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. యూకేలో ఓ కంపెనీ వారు చేసిన చిన్న తప్పు.. చివరకు ఓ మహిళకు తలనొప్పి తెచ్చిపెట్టింది. సాధారణంగా ఫోన్ మీద ఫోన్లు వస్తుంటే.. ఏంట్రా బాబూ తననొప్పి అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఓ మహిళకు రోజూ ఏకంగా 4500 ఫోన్లు రావడం మొదలెట్టాయి. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందులకు గురైంది. చివరకు అసలు విషయం తెలిసి షాక్‌కు గురైంది..


యూకేలోని ఉత్తర ఐర్లాండ్‌ బాంగోర్‌కు చెందిన హెలెన్‌ అనే మహిళకు ఉన్నట్టుండి ఫోన్ల మీద ఫోన్లు రావడం మొదలెట్టాయి. ఫోన్ చేసిన వారు తమ సమస్యలను ఏకరువు పెట్టడం మొదలెట్టారు. కొందరు తమ కార్డు బ్యాలెన్స్ చెక్ చేయాలని, ఇంకొందరు కొత్త కొత్త ఆఫర్లను తెలియజేయాలని అడగడం మొదలెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆ మహిళ ఖంగుతింది. అప్పటికీ కొందరి సమస్యలను పరిష్కరించిన ఆమెకు.. పదే పదే ఫోన్లు వస్తుండడంతో రాంగ్ నంబర్ అని చెప్పేసింది. చివరకు అసలు విషయం తెలిసింది.

ఆ చిన్నారి వయసు ఆరేళ్లు.. తన ఇంటి విలువ రూ.3.6కోట్లు.. ఎలా సాధ్యమైందో తెలుసా..


డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎకానమీ అనే సంస్థ డెలివరీ చేసిన స్పెండ్ లోకల్ స్కీమ్ నెంబర్‌‌కు, ఈ మహిళ నంబర్‌కు చివరలో ఒకే నంబర్ తేడా ఉంది. ఆ కంపెనీ వారు కస్టమర్లకు నంబర్ ఇచ్చే క్రమంలో హెలెన్‌ బిజినెస్‌ కాంటాక్ట్‌ నెంబర్‌ని ఇచ్చారు. దీంతో ఆ కంపెనీకి రావాల్సిన ఫోన్లన్నీ ఈ మహిళకు వెళ్లడం మొదలెట్టాయి. చివరకు అసలు విషయం తెలుసుకుని ఆమె అవాక్కయింది. అనంతరం డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎకానమీ నిర్వాహకులు.. సదరు మహిళకు క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

స్మార్ట్‌ఫోన్‌కు బ్యాండు బాజాల మధ్య.. గుర్రపు బండిపై ఊరేగింపు.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..

Updated Date - 2021-12-24T03:24:17+05:30 IST