ఫ్రెండ్ ఇచ్చిన బ్లాక్(మెయిల్)టీ తాగింది.. 10 లక్షలు మూల్యం చెల్లించింది.. భర్త ఏమైందని అడగడంతో...

ABN , First Publish Date - 2021-10-04T01:43:16+05:30 IST

సోషల్ మీడియా ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే పర్లేదు. కానీ కొందరు.. దుర్వినియోగం చేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అ

ఫ్రెండ్ ఇచ్చిన బ్లాక్(మెయిల్)టీ తాగింది.. 10 లక్షలు మూల్యం చెల్లించింది.. భర్త ఏమైందని అడగడంతో...

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే పర్లేదు. కానీ కొందరు.. దుర్వినియోగం చేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అపరిచితులను అతిగా విశ్వసించి.. నిండా మునుగుతున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా ఇటువంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. 


ఢిల్లీకి చెందిన ఓ 35ఏళ్ల మహిళకు 2015లో అదే ప్రాంతానికి సోనూ అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఈ క్రమంలో 2015 ఆగస్టు 8న సదరు మహిళకు సోనూ ఫోన్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయిందని.. చూడటానికి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీంతో కంగారుపడ్డ ఆ మహిళ.. తన భర్తకు చెప్పకుండానే సోనూ ఇంటికి వెళ్లింది. తీరా అక్కడ వెళ్లిన ఆమె సోనూను చూసి షాకైంది. సోనూకు యాక్సిడెంట్ కాలేదని అతడు బాగానే ఉన్నాడన్న విషయాన్ని గ్రహించింది. ఈ క్రమంలో యాక్సిండ్ అంటూ ఎందుకు అబద్దాలు చెప్పావ్ అని సదరు మహిళ సోనూని నిలదీసింది.



దానికి అతడు.. నవ్వుతూ.. టీ కోసం పిలస్తే రావనే ఉద్దేశంతో కావాలనే అలా చెప్పానంటూ.. ఓ టీ కప్పును ఆమె చేతికి అందించాడు. అంతే.. ఆ టీ తాగడమే ఆమె చేసిన తప్పైంది. టీ తాగి స్పృహ తప్పిపోయిన సదరు మహిళపై సోనూ అత్యాచారానికి పాల్పడడ్డాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను కెమెరాలో బంధించాడు. అనంతరం వాటిని చూపుతూ ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేయడమే కాకుండా.. లక్షలాది రూపాయలను దండుకున్నాడు. అయినా ఆమెకు సోనూ నుంచి వేధింపులు ఆగలేదు. కాగా.. తాజాగా సదరు మహిళ వ్యవహారశైలిపై ఆమె భర్తకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని నిలదీయడంతో.. ఆమె అసలు విషయం చెప్పేసింది. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-10-04T01:43:16+05:30 IST