ltrScrptTheme3

నైట్ షిఫ్ట్ తర్వాత ఇంటికి వెళ్లేందుకు తెల్లవారుజామున 3 గంటలకు క్యాబ్ ఎక్కింది.. అదే ఆమె పాలిట శాపంగా మారింది..

Sep 23 2021 @ 10:45AM

ఆమె బెంగళూరులోని ఓ సంస్థలో ఉద్యోగిని.. నైటి షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేందుకు తెల్లవారుజామున మూడు గంటలకు క్యాబ్ బుక్ చేసింది.. మురుగేష్‌పాల్య ప్రాంతంలో క్యాబ్ ఎక్కింది.. మార్గమధ్యంలో క్యాబ్ డ్రైవర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఆమెను రేప్ చేశాడు.. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. 22 ఏళ్ల బాధిత మహిళ గురువారం వేకువజామున మూడు గంటలకు తన డ్యూటీ పూర్తి చేసుకుని క్యాబ్ ఎక్కింది. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే దేవరాజ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. క్యాబ్ డ్రైవర్ వివరాలు వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దేవరాజ్ కోసం గాలింపులు చేపడుతున్నారు.    

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.