మాజీ ప్రియుడిపై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడ్డ ‘ప్రేయసి’ బండారం!

Published: Sun, 16 Jan 2022 21:08:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మాజీ ప్రియుడిపై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడ్డ ప్రేయసి బండారం!

ప్రేమికులు విడిపోయిన సందర్భాల్లో ఎక్కువగా యువతులే మోసపోతుంటారు. మాయమాటలు నమ్మి చివరకు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో యువకులు కూడా మోసపోతుంటారు. ఇటీవల అలాంటి వార్తలు చాలా వింటూనే ఉన్నాం. అదే క్రమంలో ఇంగ్లాండ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రియుడు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అనుమానం రావడంతో లోతుగా విచారించగా అసలు నిజం తెలిసింది.

మాజీ ప్రియుడిపై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడ్డ ప్రేయసి బండారం!

ఇంగ్లాండ్‌కు చెందిన కర్టనీ ఎయిన్స్‌ వర్త్‌(20)అనే యువతి లూయీస్ అనే యువకుడిని ప్రేమించింది. కొన్నాళ్లు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే తర్వాత కొన్నాళ్లకు విభేదాలు వచ్చి విడిపోయారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రియురాళ్లపై ప్రియుళ్లు పగ తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం విచిత్రంగా మాజీ ప్రియుడిపై యువతి పగ తీర్చుకోవాలని కుట్ర పన్నింది. ఎన్నో రకాలుగా ఆలోచించి చివరకు ఒక పథకం పన్నింది. తన మాజీ ప్రియుడి పేరుతో 30 నకిలీ ఇన్‌స్టాగ్రాం అకౌంట్లు ప్రారంభించింది.

డబ్బులు నష్టపోయానని కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసిన మహిళ.. చివరగా అకౌంట్ బ్యాలెన్స్ పరిశీలిస్తే..

మాజీ ప్రియుడు తనను చంపేస్తానని బెదిరించినట్లుగా.. తనకు తానే మెసేజ్‌లు పంపించుకుంది. ఇలా చాలా మెసేజ్‌లు పంపించుకున్నాక.. ఓరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై మాజీ ప్రియుడు పగ పట్టాడని ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో లూయీస్.. తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే తర్వాత పోలీసులకు అనుమానం వచ్చి.. లోతుగా విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తన తప్పును ఒప్పుకొంది. దీంతో కోర్టు ఆమెకు 10 నెలల జైలు శిక్ష విధించింది.

బీకాం విద్యార్థినిని ఆమె తల్లితో సహా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఏం చేసేవాళ్లంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

రాత్రికి రాత్రే ట్యాంకర్లలోంచి 3000 లీటర్ల డీజిల్ మాయం.. సీసీ కెమెరాలను చెక్ చేస్తే..15 రోజుల క్రితం పెళ్లి.. గంటల తరబడి చాటుగా భార్య ఫోన్ కాల్స్.. నిఘా వేసి భర్త ఇచ్చిన ట్విస్ట్‌తో ఆమెకు మైండ్‌బ్లాంక్..!18 ఏళ్ల కూతురు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఫిర్యాదు.. పోలీసులు చెప్పింది విని అంతా షాక్.. మరో యువతితో కలిసి..ఈ సారి నిన్ను దేవుడు కూడా కాపాడలేడు.. ఇదీ ఆస్పత్రిలో ఉన్న భర్తకు ఓ భార్య వార్నింగ్.. ఇంతకీ అసలేం జరిగిందంటే..9నెలల క్రితం కొడుక్కు పెళ్లి.. కాపాడండంటూ రాత్రిపూట కోడలి కేకలు.. కంగారుగా గదిలోకి ఆ తండ్రి వెళ్లి చూస్తే..కూతురు బతుకుతుందని 2నెలలుగా ఎదురుచూపులు.. ఆ తల్లిదండ్రులు రోజూ చేసే పని చూసి..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.