పాఠాలు చెప్పాల్సిన మహిళా టీచర్.. తరచూ ప్రిన్సిపాల్‌ గదిలో సమావేశం.. గ్రామస్తులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా..

Published: Sun, 24 Apr 2022 23:13:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాఠాలు చెప్పాల్సిన మహిళా టీచర్.. తరచూ ప్రిన్సిపాల్‌ గదిలో సమావేశం.. గ్రామస్తులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా..ప్రతీకాత్మక చిత్రం

పిల్లలకు పాఠాలు నేర్పించి, వారి భవిష్యత్‌కు మార్గదర్శకం కావాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పాఠశాలకు రాగానే పాఠాలు చెప్పాల్సింది పోయి... సమావేశం పేరుతో తరచూ ప్రిన్సిపాల్ గదికి వెళ్లేది. మొదట్లో నిజంగానే సమావేశమేమో అని అంతా అనుకున్నారు. అయితే గ్రామస్తులకు అనుమానం వచ్చి నిఘా పెట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. 

ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ మహిళ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూ పిల్లలకు పాఠాలు బోధించాల్సిన ఆమె... కొన్ని రోజులకు అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం మొదలెట్టింది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ పాల్‌తో సమావేశం పేరుతో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేది. సమావేశం పేరుతో ప్రిన్సిపాల్ గదికి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరూ కలిసి ఏకంగా గదిలోనే రాసలీలలు సాగించేవారు. వీరిపై పాఠశాలలో ఎవరికీ అనుమానం రాలేదు.

ఉద్యోగం ఇప్పిస్తామని మహిళలను తీసుకెళ్లారు.. గదిలో బంధించి అశ్లీలంగా నృత్యం చేయమంటూ..

అయితే ఈ విషయం గ్రామస్తులకు తెలిసి నిఘా పెట్టారు. ఓ రోజు కొందరు పాఠశాలలకు వెళ్లి గదిలో పరిశీలించగా.. ప్రిన్సిపాల్‌తో రాసలీలలు సాగిస్తూ పట్టుబడింది. ఈ సమయంలో కొందరు ఫోన్‌లో వీడియోలు తీశారు. అనూహ్య పరిణామానికి అవాక్కయిన ప్రిన్సిపాల్... వీడియోలు తొలగించేందుకు డబ్బులు ఆశ చూపాడు. దీనిపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు.. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పుట్టిన రోజు సందర్భంగా ప్రియురాలిని ఇంటికి పిలిచాడు.. ప్రత్యేకంగా మాట్లాడాలంటూ గదిలోకి తీసుకెళ్లి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

అరుదైన మేలు జాతి గుర్రాన్ని రూ.23 లక్షలకు కొనుగోలు చేశాడు.. ఇంటికెళ్లి స్నానం చేయించి చూస్తే..ప్రియుడి కోసం భర్తను దూరం పెట్టింది... నాకు చేసినట్లు మరెవరికీ చేయొద్దంటూ భార్యకు లేఖ రాసిన భర్త.. స్నేహితుడితో కలిసి అత్త ఇంటికి వెళ్లిన యువకుడు.. దుస్తులు మార్చుకుని బయటికి వచ్చాడు.. స్థానికులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా.. తండ్రి అంటే ఆ తొమ్మిది మంది కూతుళ్లకు ఎంతో అభిమానం.. అయితే అతను వారి పక్కన కూర్చుని చేసిన పనికి..పని నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన భర్త.. బెడ్‌రూంలో ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చి.. తలుపు తీసి చూడగా..రాత్రి 10.30 గంటల సమయం.. రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ చివర ఓ ప్రేమజంట.. కానిస్టేబుల్ చూసి నిలదీస్తే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.