ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల తిష్ట

ABN , First Publish Date - 2022-06-23T04:21:49+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేది శగా బడిబాట, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలను కొన సాగిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయ నీయంగా మారింది.

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల తిష్ట
మేడిపూర్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి చేరిన వర్షపు నీరు(ఫైల్‌)

- శిథిలావస్థకు చేరిన భవనాలు

- నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు  - వర్షాలకు పాఠశాలల్లోకి చేరుతున్న నీరు

- మండల వ్యాప్తంగా 37పాఠశాలల్లో  14 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ


తాడూరు, జూన్‌ 22: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేది శగా బడిబాట, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలను కొన సాగిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయ నీయంగా మారింది. కొద్దిపాటి వర్షాలకే పాఠశాల భవనాలతోపాటు పాఠశాల ఆవరణలో సైతం వర్షపు నీరు చేరుతుండడంతో విద్యా ర్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మండల కేంద్రంతో పాటు మండలంలోని 24గ్రామపంచాయతీ పరిధిలో 24ప్రాథమిక పాఠశాలలు, ఏడు ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కలుపుకొని 4,224మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుం డగా వీరిలో ఆడపిల్లలు 2,289మంది కాగా మగ పిల్లలు 1,935 మంది విద్యార్థులు ఉన్నారు. అన్ని పాఠశాలల్లో కలుపుకొని 188 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం స్కూల్‌ అసి స్టెంట్స్‌ ఐదు పోస్టులు, ఎస్‌జీటీలు రెండు, ఎల్‌ఎక్స్‌ఎల్‌ ఐదు, జీహెచ్‌ఎంలు రెండు పోస్టులతో మొత్తం 14ఖాళీలున్నాయి. ప్రస్తు తం విధి నిర్వహణలో 174 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదిలా ఉండగా, పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు మరుగుదొడ్ల నిర్వ హణ శాపంగా మారింది. నిర్మాణ పనుల్లో అసంపూర్తిగా ఉన్న చా లా పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లు సైతం నిరుపయోగంగానే ఉన్నాయి. పాఠశాలల ఆవరణలో ఆడుకునేందుకు విద్యార్థులకు సరైన వసతులు, సామగ్రి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఆయా గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు. పాఠశాలల్లో ఇప్పటికీ పాఠ్యపుస్త కాల సరఫరా లేకపోవడం మూలంగా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే పుస్తకాల సరఫరా చేసే విధంగా చూసి విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు. 

సమస్యలెన్నో..

వెల్దండ:  కనీస మౌలిక వసతులకు నోచుకోని పాఠశాలలు మండలంలో ఎన్నో ఉన్నాయి. విద్యావ్యవస్థ పట్టిష్ట పరిచి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పనిచేస్తామని ప్రకటిస్తున్నా ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. మండలంలో 45 ప్రాథమిక, ఐదు ప్రాథమికోన్నత పాఠశాలలు, ఏడు ఉన్నత పాఠశాలలు, మోడల్‌స్కూల్‌, గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. కాగా చాలావరకు పాఠశాలల్లో మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడం, ప్రహరీలు లేకపోవడం, అదనపు గదుల కొరత, ఉన్నవాటికి మరమ్మతులు అవసరం ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు - మనబడి కార్యక్రమాన్ని గత నాలుగు నెలలుగా ప్రవేశపెట్టి ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకై సమస్యలను గుర్తించారు. ఈ క్రమంలో మండలంలోని 20 పాఠశాలల్లో మొదటి విడతగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయినప్పటికీ నెలలు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. దీంతో ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికి పనులు మాత్రం మొదలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా పాఠశాలల్లో సమస్యలు గుర్తించి తక్షణమే పూర్తిచేయాల్సిన బాధ్యత అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉంది. 



Updated Date - 2022-06-23T04:21:49+05:30 IST