పేదలపై వైసీపీ ప్రభుత్వం బాదుడే బాదుడు

Published: Sun, 22 May 2022 01:26:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పేదలపై వైసీపీ ప్రభుత్వం బాదుడే బాదుడుపొదిలిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు

మార్కాపురం, మే 21 : పేదల సంక్షేమం   కోసం కృషి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ పేదలపై పన్నులు, కరెంట్‌ బిల్లులతో బాదుడే బాదుడుతో దోచుకుంటుందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 3వ వార్డులో  బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏపీలో నవరత్నాల ముసుగులో పేదలను నవ బాదుడు బాదుతున్నారని అన్నారు.  వైసీపీ ప్రభుత్వం పేదలపై చెత్త పన్ను, ఇంటి పన్నులతో పాటు నిత్యవసర ధరలు పెంచారని అన్నారు. ఇసుక , సిమెంట్‌, ఇనుము, రిజిస్టేషన్‌ చార్జీలు పెంచి సమాన్యుల నడ్డి విరుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో  మాజీ జడ్పీటీసీ సభ్యుడు కందుల రామిరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు డాక్టరు మౌలాలి, టీడీపీ నాయకులు కోప్పుల శ్రీనివాసులు, డి.మస్తానయ్య, పి.మల్లిఖార్జున, శ్రీనివాసరెడ్డి, వలి, శ్రీను, గంగయ్య,  నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

పొదిలి: వైసీపీ అసమర్ధపాలనకు చరమ గీతం పాడాలని టీడీపీ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోని మూడవవార్డులో బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన నిత్యావసర వస్తువులను తెలియజేస్తూ కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రోజురోజుకు ఏదోవిధంగా ప్రజలపై ఆర్ధికబారాలు మోపుతూ నడ్డి విరుస్తున్నారన్నారు. పాదయాత్రలో హామీలు ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చకపోగా అడిగిన వారిపై దాడులు చేస్తు న్నారని ధ్వజమెత్తారు. అందరు ఏకమై జగన్‌రెడ్డిని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముల్లాఖుద్దూస్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మీగడ ఓబుల్‌రెడ్డి, రాష్ట్రకార్యదర్శి గునుపూడి భాస్కర్‌, టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం మాజీ అద్యక్షుడు సామంతపూడి నాగేశ్వరరావు, టీఎస్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అనీల్‌ (పండు), జిల్లా కార్యదర్శి షేక్‌ గౌస్‌, జిల్లా నాయకులు రసూల్‌, యాసిన్‌,షాహిద్‌,  మాజీ సర్పంచ్‌ కాటూరి చిన్నబాబు,జిల్లా మహిళా నాయకు రాలు షేక్‌ షహనాజ్‌బేగం,  మండల నాయకులు కాటూరి శ్రీను, ముని శ్రీనివాసులు, జ్యోతి మల్లిఖార్జున, రోళ్ళశ్రీనివాసులు, ఠాగూర్‌, మౌలాలి, సురేష్‌, అల్లాబకాష్‌, ఖయ్యుం, కల్‌నాయక్‌, వార్డు మెంబర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

రాచర్ల : టీడీపీ బలోపేతానికి బీసీ సంఘా ల నుంచి తనవంతు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు బీసీ సెల్‌ అధికార ప్రతినిధి నల్లబోతుల శ్రీనివాసులు అన్నారు. రాచర్లలో ఆయన శనివారం మాట్లాడుతూ తనను టీడీపీలో బీసీ సెల్‌ అధికార ప్రతినిధిగా నియమించడం సంతోషించదగ్గ విషయమన్నారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సహకారంతో గ్రామాల్లో పర్యటించి టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.