ప్రజలపై భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-15T04:46:01+05:30 IST

సంక్షేమ పఽథ కాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి నిత్యావసర వస్తు వుల ధరలను పెంచి పెనుభారం మోపుతుందని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

ప్రజలపై భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వం
కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

ఏదుబాడు(పర్చూరు), అగస్టు 14: సంక్షేమ పఽథ కాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి నిత్యావసర వస్తు వుల ధరలను పెంచి పెనుభారం మోపుతుందని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. మండలంలోని ఏ దుబాడు గ్రామంలో ఆదివారం జరిగిన బాదుడే బా దుడు కార్యక్రమంలో  టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌  మాట్లాడుతూ నిత్యావసర వస్థువు ల ధరలను నియంత్రించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, పెట్రో లు, డీజల్‌, గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలపై మోయ లేని భారం మోపుతున్నారన్నారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై మోపి న అదనపు బారంతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేవిధంగా ఇంటింటికి తి రిగి కరపత్రాలు పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో నాయకులు అ ప్పలనేని నరేంద్ర, కొండ్రగంటి శి వనాగేశ్వరరావు, మిన్నకంటి వాసు బాబు, మామిడిపాక హరిప్రసాద్‌, శ్రీరాం వెంకటసుబ్బారావు, శేషగి రి, రామ్మోహన్‌, కాపు రవిచంద్ర, గిరి, ఆదినారాయణ, వినాయక, జువ్వాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-15T04:46:01+05:30 IST