పేదల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-16T05:37:15+05:30 IST

ఇస్టానుసారంగా ధరలను పెంచుతూ వైసీపీ ప్రభు త్వం పేదల నడ్డివిరుస్తోందని టీడీపీ మండలాధ్యక్షుడు వైజీ సురేంద్రయాదవ్‌ ఆరోపించారు.

పేదల నడ్డివిరుస్తున్న వైసీపీ ప్రభుత్వం
కురబలకోటలో టీడీపీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న పార్టీ నాయకులు

 టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఇద్దరు వైసీపీ వార్డు మెంబర్లు 

కురబలకోట, మే15: ఇస్టానుసారంగా ధరలను పెంచుతూ వైసీపీ ప్రభు త్వం పేదల నడ్డివిరుస్తోందని టీడీపీ మండలాధ్యక్షుడు వైజీ సురేంద్రయాదవ్‌ ఆరోపించారు. కురబలకోట మండలం ఎర్రబల్లి, సింగన్నగారిపల్లె, చినపరెడ్డిగారిపల్లె, కంటేవారిపల్లె తదితర గ్రామాల్లో ఆదివారం బాదుడే.. బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబల్లి పంచాయతీకి చెందిన ఇద్దరు వైసీపీ వార్డు మెంబర్లు శ్రీనాథ్‌రెడ్డి, వెంకటరమణలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో 30 ఏళ్లు వెకబడ్డామన్నారు.  కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రమణ, బాలాజీ, రమణ, నరసింహులు, చంద్రారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

ములకలచెరువులో: బాదుడు ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు చమరగీతం పాడడం ఖాయమని మండల టీడీపీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి ముత్తు కూరు మౌలా పేర్కొన్నారు. మండలంలోని వేపూరికోటలో ఆదివారం తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు జేసీబీ సుధాకర్‌నాయుడు, నియోజకవర్గ బీసీసెల్‌ అధ్యక్షుడు చెన్నకిష్టా, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ కేవీ రమణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మూగి రవిచంద్ర, నాయకులు కాల మహేష్‌, భాస్కర్‌రెడ్డి, చలపతి, బాలాజీ, రెడ్డెప్ప, చంద్రప్ప, గంగులప్ప, గురునాధ రెడ్డి, శ్రీనివాసులు, శివరామిరెడ్డి, పెద్దశంకర తదితరులు పాల్గొన్నారు. 

నిమ్మనపల్లెలో: అధిక ధరల భారంతో సామాన్య ప్రజలపై జగన్‌ ప్రభుత్వం మోయలేని భారం మోపుతోందని మదనపల్లె టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఎర్రప్పగారిపల్లిలో మాజీ సర్పంచ్‌ వెంకటరమణ, టీడీపీ నాయకుడు  శ్రీనివాస్‌లు మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి రాగానే కరెంట్‌, పెట్రోల్‌, డీజిల్‌, ఇసుక, స్టీల్‌, గ్యాస్‌ తదితర వాటిపై రేట్లు పెంచారన్నారు.  కార్యక్రమంలో నాయకులు సర్పంచ్‌ రెడ్డెప్ప, రాజన్న, జగదీష్‌, శ్రీపతి, మల్లప్ప, రాజన్న, వెంకటరమణ,క్రిష్ణప్ప, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

పెద్దమండ్యంలో:  ప్రభుత్వం పెంచిన విద్యుత్‌, బసు చార్జీల ధరలను వెంటనే తగ్గించాలని  మండల టీడీపీ కన్వీనర్‌ వెంకట రమణ డిమాండ్‌ చేశారు.  మండలం లోని రామానాయక్‌తాండ లో ఆదివారం  మండల టీడీపీ కన్వీనర్‌ ఆధ్వర్యంలో టీడీపీ మండల నాయకులు బాదుడు బాదు డే కార్యక్రమం నిర్వహించారు. నాయకులు శ్రీనివాసులు, మనోహర్‌ నాయక్‌, కాలేషా, శ్రీనివాసులు, బానుయాదవ్‌, సాంబ, బిక్కామధుకర, ఓబులేసు, బాబ్‌జాన్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.     

తంబళ్లపల్లెలో: అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని తంబళ్లపల్లె మండల టీడీపీ నాయకులు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ ఆదేశాల మేరకు ఆదివారం కన్నెమడుగు పంచాయతీలోని సాకలపల్లెలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్పెప్పరెడ్డి, తెలుగు యువత నాయకులు గంగరాజు, నరసింహులు, మాజీ సర్పంచ్‌ బేరిశీన, కృష్ణారెడ్డి, ఆనంద, వెంకట్రాముడు, శీన, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-16T05:37:15+05:30 IST