చెరువులో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-25T05:40:51+05:30 IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సీతాయిపల్లి గ్రామ చెరువులో శనివారం ఉదయం చోటు చేసుకుంది.

చెరువులో పడి యువకుడి మృతి

గాంధారి, జూలై 24: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సీతాయిపల్లి గ్రామ చెరువులో శనివారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం పోతంగల్‌ కలాన్‌ గ్రామస్థులకు చెరువులో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహన్ని వెలికితీశారు.  ఒద్దుల సంతో్‌ష్‌(20)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-25T05:40:51+05:30 IST