వామ్మో! ఇతనేంటీ.. మూడు నిమిషాల్లో ఇన్ని కేకులు తిన్నాడు.. మొత్తానికి రికార్డు సృష్టించాడు కదా..

ABN , First Publish Date - 2022-03-06T03:03:06+05:30 IST

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా తనకు ఇష్టమైన కేకులు తిని.. ప్రపంచ రికార్డు సృష్టించాడు. తినడం ఎంత ముఖ్యమో.. దాన్ని జీర్ణించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ వ్యక్తి మాత్రం..

వామ్మో! ఇతనేంటీ.. మూడు నిమిషాల్లో ఇన్ని కేకులు తిన్నాడు.. మొత్తానికి రికార్డు సృష్టించాడు కదా..

ప్రపంచ రికార్డు సృష్టించాలని అందరికీ ఉంటుంది. కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. వివిధ విభాగాల్లో అందరికంటే వేగంగా పనులు చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న వారిని ఎంతో మందిని చూస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా తనకు ఇష్టమైన కేకులు తిని.. ప్రపంచ రికార్డు సృష్టించాడు. తినడం ఎంత ముఖ్యమో.. దాన్ని జీర్ణించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ వ్యక్తి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం మూడు నిమిషాల్లో ఎవరికీ సాధ్యం కానన్ని కేకులు తిని రికార్డును సొంతం చేసుకున్నాడు.


లండన్‌కి చెందిన మాక్స్ స్టాన్‌ఫోర్డ్ అనే వ్యక్తి ఈ ఘనత సాధించాడు. ఇతడికి తినడం అంటే చాలా ఇష్టమట. తినడం ద్వారానే డబ్బు సంపాదించడం హాబీ అని చెబుతుంటాడట. మాక్స్‌కు కేకులు అంటే ఎంతో ఇష్టమట. దీంతో కేకులు తింటూనే ప్రపంచ రికార్డు సృష్టించాలని ఎన్నేళ్లుగానో కలలు కనేవాడు. అయితే తన కలను ఇటీవల సాకారం చేసుకున్నాడు. లండన్‌లోని డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. మాక్స్, కేవలం 3 నిమిషాల్లో 88 కేకులు తిని ప్రపంచ రికార్డు సృష్టించగలిగాడు. కేకు తినే క్రమంలో గొంతులో ఇరుక్కోకుండా.. ఇతడు మొత్తం మూడు నిమిషాల వ్యవధిలో ఆరు గ్లాసుల వేడి నీరు తీసుకున్నాడట. మొత్తానికి తన కల సాకారం అవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇతడు 2020లో జాఫా కేక్స్ తిని రికార్డు కొట్టాలని ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో మూడు నిమిషాల్లో 36 కేకులు మాత్రమే తినగలిగాడట. ఎట్టకేలకు తన సాకారం చేసుకున్న మాక్స్‌ను స్నేహితులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆ ప్రాంతంలో అతన్ని అంతా  ప్రొఫెషనల్ ఈటర్ అని పిలుస్తారట.

వరుస కాదని తెలిసినా బాలికపై వక్ర దృష్టి.. తల్లి, భార్య సహకారంతో చివరికి అతడు చేసిన పని..

Updated Date - 2022-03-06T03:03:06+05:30 IST