బస్సు ఆగకముందే దిగేందుకు డోర్ వద్దకు రావడం ఎంత ప్రమాదమో ఈ ఘటనే చెబుతోంది.. ఒక్క నిమిషం ఆగి ఉంటే..

ABN , First Publish Date - 2022-06-28T20:26:04+05:30 IST

ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదకరం అనే హెచ్చరిక అని బస్సులలో తప్పనిసరిగా కనిపిస్తుంటుంది.

బస్సు ఆగకముందే దిగేందుకు డోర్ వద్దకు రావడం ఎంత ప్రమాదమో ఈ ఘటనే చెబుతోంది.. ఒక్క నిమిషం ఆగి ఉంటే..

ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదకరం అనే హెచ్చరిక అని బస్సులలో తప్పనిసరిగా కనిపిస్తుంటుంది. అయినా చాలా మంది ఫుట్‌బోర్డ్‌ల మీద నిల్చునే ప్రయాణం చేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు ఫుట్‌బోర్డ్ మీద నుంచి కాలు జారి బస్సు కింద పడిపోయాడు. తల తెగి పడడంతో అక్కడికక్కడే మరణించాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ ఘటన జరిగింది. బాతల గ్రామానికి చెందిన సతారామ్ (25) అనే యువకుడు బార్మర్‌లో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. 


ఇది కూడా చదవండి..

Viral Video: కళ్ల ముందే కనిపించకుండా పోయిన ఇల్లు.. కళ్లు మూసి తెరిచేలోపే మాయమైపోయిందిలా..!



సతారామ్ రోజూ బార్మర్‌లో పనిచేసి రాత్రికి తిరిగి గ్రామానికి వెళ్తుంటాడు. సోమవారం రాత్రి ఓ ప్రైవేట్ బస్సు ఎక్కాడు. 12 గంటల సమయంలో బస్సు గ్రామానికి చేరుకుంది. అయితే బస్సు పూర్తిగా ఆగకముందే సతారామ్ ఫుట్‌బోర్డ్ పైకి వచ్చాడు. అక్కడ కాలు జారిపోవడంతో నేరుగా బస్సు టైరు కింద పడిపోయాడు. అతడి తలపై నుంచి బస్సు వెళ్లిపోయింది. దీంతో సతారామ్ అక్కడికక్కడే మరణించాడు. ఆ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతారామ్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. 

Updated Date - 2022-06-28T20:26:04+05:30 IST