సివిల్ ఇంజనీర్‌ జాబ్‌కు గుడ్‌బై.. ఇప్పుడు రోజుకు 6 వేల సంపాదన.. ఇంతకీ ఇతడు చేస్తున్న పనేంటంటే..

ABN , First Publish Date - 2022-04-30T18:22:51+05:30 IST

ఆ యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో పాటూ మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కానీ అతడిలో మాత్రం ఏదో అసంతృప్తి. సొంతంగా వ్యాపారమో, వ్యవసాయమో చేయాలని...

సివిల్ ఇంజనీర్‌ జాబ్‌కు గుడ్‌బై.. ఇప్పుడు రోజుకు 6 వేల సంపాదన.. ఇంతకీ ఇతడు చేస్తున్న పనేంటంటే..

ఆ యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో పాటూ మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కానీ అతడిలో మాత్రం ఏదో అసంతృప్తి. సొంతంగా వ్యాపారమో, వ్యవసాయమో చేయాలని నిత్యం ఆలోచించేవాడు. ఈ క్రమంలో అతడి స్నేహితుల ద్వారా ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆలోచన వచ్చిందే తడవుగా సివిల్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతడు ఎంచుకున్న రంగంలో రాణించి.. ప్రస్తుతం రోజుకు రూ.6వేలు సంపాదిస్తున్నాడు. అంటే నెలకు లక్షా 80 వేల రూపాయల సంపాదన అన్నమాట. ఇంతకీ అతను ఎవరు, అతడు చేస్తున్న పనేంటి.. తదితర వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పరిధి గుణ నగరంలోని కోకటే కాలనీలో నివాసం ఉంటున్న అనిమేష్ శ్రీవాస్తవ.. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతడికి మాత్రం సొంతంగా వ్యాపారమో, వ్యవసాయమో చేయాలని ఉండేది. ఈ క్రమంలో అతడి స్నేహితుడిని కలవడం ద్వారా మొక్కల పెంపకం గురించి తెలుసుకున్నాడు. అయితే ఇందులో ప్రత్యేకమైన పూల మొక్కలను పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఏ రకమైన నేలలో ఎలాంటి మొక్కలు పెంచాలనే అంశంపై పూణేలోని ప్రముఖ  ఇన్‌స్టిట్యూట్‌లో 15రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు. అనంతరం 2018లో గుణ నగరానికి 30కిలోమీటర్ల దూరంలో సొంత భూమిలో పాలీ హౌస్ నిర్మించి, గులాబీ సాగు ప్రారంభించారు. అయితే సాధారణ గులాబీలు కాకుండా డచ్ రోజ్ అనే కొత్త రకం గులాబీల సాగు చేపట్టాడు. ఈ రకం గులాబీ మొక్కలు దేశంలో ఒక్క పూణేలో తప్ప మిగతా ప్రాంతాల్లో దొరకవని శ్రీవాస్తవ చెబుతున్నాడు. మరిన్ని వివరాలు అతడి మాటల్లోనే..

రూ.1,2కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్ ఆఫర్.. రికార్డు సృష్టించిన లక్నో విద్యార్థి...


‘‘డచ్ గులాబీ మొక్కను ఒక్కోటి రూ.11కి కొనుగోలు చేశా. మొత్తం 3 ఎకరాల్లో 24 వేల మొక్కలు నాటాను. ఈ మొక్కలు ఐదేళ్ల పాటు నిరంతర ఉత్పత్తిని ఇస్తాయి. పాలీ హౌస్ నిర్మాణానికి సుమారు రూ.30 లక్షలు వెచ్చించా. ఇందుకు ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీ అందింది. గులాబీలను ప్రధానంగా ఢిల్లీ, జైపూర్ ప్రాంతాలకు తరలిస్తుంటాను. గుణ నగరం నుంచి రవాణా సౌకర్యం కూడా సులభంగా ఉండడంతో వ్యాపారులు ఇక్కడికే వచ్చి గులాబీలను తీసుకెళ్తుంటారు. ఢిల్లీకి చెందిన కొందరు వ్యాపారులు నా వద్ద గులాబీలను కొనుగోలు చేసి.. దుబాయ్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు సరఫరా చేస్తుంటారు.

ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..


‘‘రోజుకు సుమారు 60-70 బండిల్స్ గులాబీలు ఉత్పత్తి అవుతాయి. 20 గులాబీలు ఉండే బండిల్‌ను రూ.100వరకు విక్రయిస్తుంటాను. రోజుకు రూ.5నుంచి రూ.6వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ రకం గులాబీల సాగు చేయాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కకు, మొక్కకు మధ్య 15 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. అలాగే 25-27 డిగ్రీల ఉష్ణోగ్రత, 70-85 శాతం తేమ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 40రోజులకు ఒకసారి దిగుబడి వస్తుంది. డ్రిప్ పైపుల ద్వారా నీరు పెట్టడంతో పాటూ కాల్షియం నైట్రేట్, మెగ్నీషియంను మొక్కలపై రోజూ పిచికారీ చేయాలి’’ అని శ్రీవాస్తవ సూచిస్తున్నాడు.

ఆవులు, గేదెలు లేకుండా పాల వ్యాపారమేంటని అంతా నవ్వారు.. కానీ ఇప్పుడు లక్షల సంపాదన..!

Updated Date - 2022-04-30T18:22:51+05:30 IST