Viral Video: ఇతడి టాలెంటే వేరు.. చేతిపై అన్ని గుడ్లను ఎలా బ్యాలెన్స్ చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2022-03-07T00:40:25+05:30 IST

ఓ వ్యక్తి తన చేతి మీద.. గుడ్లను ఒకదానిమీద ఒకటి పెడుతూ బ్యాలెన్స్ చేస్తాడు. ఈ వీడియో చూసి, వావ్! సూపర్.. అంటూ ఆ వ్యక్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు..

Viral Video: ఇతడి టాలెంటే వేరు.. చేతిపై అన్ని గుడ్లను ఎలా బ్యాలెన్స్ చేశాడో చూడండి..

వినూత్నంగా ఆలోచిస్తూ.. విభిన్నమైన పనులు చేసే వారు.. సోషల్ మీడియా వేదికను సద్వినియోగం చేసుకుంటున్నారు. వారు తమ టాలెంట్‌కి పదును పెడుతూ వినూత్నమైన పనులు చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. తద్వారా వారికి ఎక్కడ లేని ఫేమ్ వచ్చి పడుతుంటుంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి తన చేతి మీద.. కోడి గుడ్లు ఒకటి పై ఒకటి పెడుతూ అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తాడు. ఈ వీడియో చూసి, ‘‘వావ్! సూపర్.. ’’అంటూ ఆ వ్యక్తిని నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు...


ఇన్‌స్టాగ్రాంలో ఈ ఎగ్స్ వీడియో వైరల్ అవుతోంది. వివిధ విన్యాసాలకు సంబంధించి ఇప్పటిదాకా మనం ఎన్నో వీడియోలను చూసుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలో మాత్రం ఇరాక్‌కు చెందిన ఇబ్రహీం అనే యువకుడు.. తన అరచేతి వెనుక భాగంపై గుడ్లతో చేసే విన్యాసం అందరినీ ఆకట్టుకుంటోంది. ముందుగా అర చేయి వేళ్ల మధ్య కొన్ని గుడ్లను పెడతాడు. తర్వాత నెమ్మదిగా ఒక్కో గుడ్డును అరచేతిపై పెట్టడం చూడొచ్చు. సాధారణంగా రెండు గుడ్లను ఒకదానిపై ఒకటి పెట్టడమే కష్టం. అలాంటిది ఈ యువకుడు చేతిపై ఏకంగా 18గుడ్లను ఒకదానిపై ఒకటి బ్యాలెన్స్ చేసి, ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తమ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పెద్దోళ్ల పెళ్లిలో సరదాగా గడిపారు.. పొద్దున చూస్తే ఆస్పత్రిలో ఉన్నారు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..





Updated Date - 2022-03-07T00:40:25+05:30 IST