Indecent behavior: కోచింగ్కు వచ్చిన యువతిని.. పొలంలోని గదికి తీసుకెళ్లి.. నాలుగు నెలలుగా వీడియో తీయడమే కాకుండా...
ABN , First Publish Date - 2022-08-01T03:08:53+05:30 IST
బీఏ చదువుతున్న ఓ యువతి రోజూ కోచింగ్కు వెళ్లేది. ఈ క్రమంలో ఆమెను కొందరు యువకులు రోజూ గమనించేవారు. అవకాశం దొరికితే ఆమెను తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు. ఈ..
బీఏ చదువుతున్న ఓ యువతి రోజూ కోచింగ్కు వెళ్లేది. ఈ క్రమంలో ఆమెను కొందరు యువకులు రోజూ గమనించేవారు. అవకాశం దొరికితే ఆమెను తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు. ఈ సమయంలో ఓ రోజు ఆమెను బలవంతంగా పొలాల్లో ఉన్న గదికి తీసుకెళ్లారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా వీడియోలు కూడా తీశారు. చివరకు వారు చేసిన నిర్వాకం.. కొన్నాళ్లకు బయటికి తెలియడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
హర్యానా (Haryana) రాష్ట్రం ఫతేహాబాద్ పరిధికి చెందిన 22ఏళ్ల యువతి.. బీఏ చదువుతూ ఇటీవల కోచింగ్కు వెళ్తుండేది. ఈ క్రమంలో ఆమెను ఇద్దరు యువకులు గమనిస్తూ ఉండేవారు. అవకాశం దొరికితే యువతిని తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు. వీలు కాకపోవడంతో జనవరిలో ఓ రోజు కోచింగ్ సెంటర్కు వెళ్తున్న ఆమెను బలవంతంగా పొలాల్లోని గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి, వీడియోలు తీశారు. బయట ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో ఆమెపై తరచూ అఘాయిత్యానికి పాల్పడేవారు.
Viral Video: ఈ యువతి.. పెళ్లి వేదికపై, అందరి ముందు.. ఏమాత్రం బిడియం లేకుండా..
మార్చి6న ఇంట్లో ఉన్న యువతికి ఫోన్ చేసి, బయటికి పిలిపించారు. ఇంట్లో ఉన్న బంగారు నగలను తీసుకురావాలని బెదిరించారు. నగలు తీసుకొచ్చిన ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. మొత్తం ఆరుమంది కలిసి యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బంధించి నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. శనివారం ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్నయువతి.. ఇంటికొచ్చి తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.