8మంది అత్యాచారం చేశారంటూ యువతి ఫిర్యాదు.. విచారణలో షాకింగ్ నిజాలు తెలియడంతో పోలీసుల షాక్..

ABN , First Publish Date - 2021-12-31T03:08:13+05:30 IST

కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. దాడులు, అత్యాచారాలు, హత్యలకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో.. కొన్నిసార్లు అనూహ్య మలుపులు చోటు చేసుకుంటూ ఉంటాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. తనపై...

8మంది అత్యాచారం చేశారంటూ యువతి ఫిర్యాదు.. విచారణలో షాకింగ్ నిజాలు తెలియడంతో పోలీసుల షాక్..

కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. దాడులు, అత్యాచారాలు, హత్యలకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో.. కొన్నిసార్లు అనూహ్య మలుపులు చోటు చేసుకుంటూ ఉంటాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. తనపై ఎనిమిది మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. అయితే అసలు విషయం తెలిసి చివరకు వారు షాక్ అయ్యారు. ఏం జరిగిందంటే..


హర్యానా గురుగ్రామ్‌కు చెందిన 22 ఏళ్ల ఓ యువతి.. తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. తనపై ఎనిమిది మంది అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే చివరికి వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి. ప్రేమ పేరుతో పలువురికి వల వేయడం, అందినకాడికి నగదును డిమాండ్ చేయడమే ఆమె వృత్తి అని తెలిసింది. మొదటగా యువకులతో ప్రేమ పేరుతో మాట్లాడటం. కొన్నాళ్లకు డబ్బులు డిమాండ్ చేయడం ఆమెకు అలవాటు. ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే.. వారిపై అత్యాచార కేసులు నమోదు చేయించడం వంటివి చేస్తుంటుందని తెలుసుకున్నారు.

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఈ క్రమంలో ఇటీవల 8మందిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించింది. అయితే డబ్బులు డిమాండ్ చేయడంతో వారు నిరాకరించారు. దీంతో వారిపై అత్యాచార ఆరోపణలు చేసిందని ఏసీపీ(క్రైమ్) ప్రీత్ పాల్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు. ఈ యువతి తల్లి, నరేందర్ యాదవ్ అనే యువకుడు కూడా సహకరించాడని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితురాలిని బుధవారం కోర్టుకు హాజరుపరిచి, అనంతరం జ్యుడీషియల్‌ కస్టడికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

చదువు చెప్పాల్సిన ప్రిన్సిపాల్.. బాలికలతో ఏం చేయించిస్తున్నారో తెలుసా.. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే..

Updated Date - 2021-12-31T03:08:13+05:30 IST