ప్రతీకాత్మక చిత్రం
ప్రేమకు ఉన్న పవిత్రతను.. కొందరు వారి స్వార్థంతో అపవిత్రం చేస్తున్నారు. పైకి ప్రేమగా నటిస్తూ చివరికి వంచించడమే పనిగా పెట్టుకుంటుంటారు. ఈ క్రమంలో ఎందరో యువతులు మోసగాళ్ల మాయ మాటలు నమ్మి చివరికి మోసపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవడంతో ముక్కు, ముఖం తెలియని వారి మధ్య కూడా పరిచయాలు పెరుగుతున్నాయి. కొన్ని పరిచయాల వల్ల మంచి జరుగుతున్నా.. చాలా పరిచయాలు చివరికి పతనానికి దారి తీస్తుంటాయి. కర్ణాటకలో తాజాగా ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రియుడు పిలవడంతో డిన్నర్‌కు వెళ్లింది. అనంతరం రాత్రి ఆమెను అతని గదికి తీసుకెళ్లాడు. అయితే ఊహించని విధంగా లోపల సీన్ మొత్తం మారిపోయింది. చివరికి జరిగిన ఘటన తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువతి.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఇదే నగరంలో నివాసం ఉంటున్న రజత్ అనే యువకుడికి డేటింగ్ యాప్‌లో నర్సుతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్న అనంతరం.. ఫోన్ నంబర్లు తీసుకున్నారు. తర్వాత ఇద్దరూ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఇలా వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలో మార్చి 24వ తేదీన ఆమెను డిన్నర్‌కు రమ్మని పిలిచాడు. అప్పటికే అతన్ని బాగా నమ్మిన యువతి.. పిలవగానే క్షణం ఆలోచించకుండా వెళ్లిపోయింది. డిన్నర్ చేసిన అనంతరం ప్రేమగా మాట్లాడుతూ అతడి గదికి తీసుకెళ్లాడు.
అయితే అక్కడకు వెళ్లిన యువతి.. అప్పటికే లోపల ఉన్న నలుగురు యువకులను చూసి షాక్ అయింది. ‘‘ ఎవరు వీళ్లంతా.. ఇక్కడికి ఎందుకు వచ్చారు’’.. అని ప్రశ్నించింది. దీంతో వారంతా వెంటనే ఆమె నోరు మూసి, అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రజత్ అప్పటికే ఢిల్లీ వెళ్లేందుకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతడి స్నేహితులైన సురేష్, యోగేష్ కుమార్, శివరానా టెక్ చంద్రనా, దేవ్ సరోహాను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి