
నంద్యాల: కర్నూలు జిల్లాలో ఆర్ఆర్ఆర్ హంగామా ఒక రోజు ముందుగానే మొదలయింది. నంద్యాల పట్టణంలోని ప్రతి థియోటర్లో ఈ సినిమా విడుదల అవుతోంది. ఇందులో భాగంగా ఇద్దరు హీరోల అభిమానుల సందడి మొదలయింది. థియేటర్ల యజమానులు తెర ముందర ప్రత్యేక ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. అభిమానుల తాకిడి ఎక్కువగా వుండటంతో వారు తెరవద్దకు వెళ్లకుండా ఉండేందకు ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదోనిలో కూడా ఇలానే చేశారు.
ఇవి కూడా చదవండి