ఏటీఎం కార్డు మార్చి నగదు అపహరణ

ABN , First Publish Date - 2021-07-27T04:09:18+05:30 IST

ఏటీఎం కార్డు మార్చి నగదు అపహరించిన సంఘటన నాయుడుపేట పట్టణంలో జరిగింది.

ఏటీఎం కార్డు మార్చి నగదు అపహరణ

నాయుడుపేట టౌన్‌, జూలై 26 : ఏటీఎం కార్డు మార్చి నగదు అపహరించిన సంఘటన నాయుడుపేట పట్టణంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు మండలంలోని భీమవరం గ్రామంలోని అంగన్‌వాడీ వర్కర్‌ తేజావతికి ఈనెల జీతం బ్యాంకు అకౌంట్‌లో జమైంది. ఆ నగదును డ్రాచేసేందుకు ఆమె సోమవారం నాయుడుపేటకు వచ్చి ఏటీఎంలో కార్డు పెట్టి చూడగా నగదు రాలేదు. దాంతో ఆమె వెనుక నిలుచుకొని ఉన్న ఓ యువకుడికి తన కార్డు ఇచ్చి నగదును డ్రా చేయాలని కోరింది. ఆ యువకుడు ఏటీఎంలో ఆ కార్డు పెట్టి నగదు రాలేదంటూ తన కార్డును ఆమెకు ఇచ్చాడు. ఆమె చూసుకోకుండా కవరులో పెట్టుకొని వెళ్లిపోయింది. కొంత సమయం తరువాత ఆమె సెల్‌ఫోన్‌కు 11,500 డ్రాఅయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆమె అనుమానం వచ్చి పట్టణంలోని తన బంధువుల ఇంటికి వెళ్లి చూడగా ఏటీఎం కార్డు మార్చినట్టు గుర్తించింది. దీంతో  బాధితురాలు తేజోవతి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-07-27T04:09:18+05:30 IST