పట్టపగలే ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2021-10-24T05:08:10+05:30 IST

మండలంలోని కేశాపురం గ్రామ పంచాయతీలోని కేశాపురం దేవళంపేటలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చోరీ జరిగినట్లు ఎస్‌ఐ మైనుద్దీన్‌ తెలిపారు.

పట్టపగలే ఇంట్లో చోరీ
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ మైనుద్దీన్‌

చిన్నమండెం, అక్టోబరు 23: మండలంలోని కేశాపురం గ్రామ పంచాయతీలోని కేశాపురం దేవళంపేటలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చోరీ జరిగినట్లు ఎస్‌ఐ మైనుద్దీన్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం... కేశాపురందేవళంపేటకు చెందిన పెనుగొండ శ్రీనివాసులుతో పాటు ఇంట్లో అందరూ పొలం పనిమీద వెళ్లారని, తిరిగి వచ్చి చూస్తే బీరువా, ఇంటి తాళాలు చూసి చోరీ జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించారు. 6 తులాల బంగారు వస్తువులు పోయాయని బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో చోరీ

కేజీ వెండి సామగ్రి అపహరణ 

కడప(క్రైం), అక్టోబరు 23 : కడప నగరం ఏఆర్‌ పోలీస్‌ కాలనీలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో దొంగలు పడి కేజీ వెండి వస్తువులు చోరీ చేసినట్లు రిమ్స్‌ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు... పోలీస్‌ కాలనీలో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ జగన్‌మోహన్‌రావు గాలివీడు పోలీ్‌సస్టేషనలో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ సభ్యులు అక్కడే నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఇంటి దొంగలు తాళాలు పగులకొట్టి బీరువాలో ఉంచిన కేజీ వెండి వస్తువులు చోరీ చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-24T05:08:10+05:30 IST