Advertisement

దేవాలయంలో ఆభరణాల అపహరణ

Mar 6 2021 @ 00:49AM


మేళ్లచెర్వు, మార్చి 5: మండలంలోని రామాపురం సీతారామాంజనేయస్వామి దేవాలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి వెండి ఆభరణాలను అపహరించారు. ఎస్‌ఐ సీహెచ్‌ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకా రం రామాపురంలోని సీతారామాంజనేయస్వామి దేవాలయంలో గురువారం రాత్రి పూజారి శ్రీనివాసాచార్యులు పూజలు చేసినంతరం ఆ దేవాల యం తలుపులకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉ దయం 6.30 గంటలకు పూజారి వెళ్లగా రెండు తలుపుల తాళాలు కట్‌చేసి కిందపడే సి ఉన్నాయి. ఆలయం లోపలికి వెళ్లి చూడగా మూలవిరాట్‌కు చెందిన మూడు వెం డి కిరీటాలు, ఉత్సవమూర్తుల ఐదు చిన్న వెండికిరీటాలు, రెండుబంగారు పుస్తెలు కనిపించలేదు. వాటివిలువ సుమారు రూ.90 వేలు ఉంటుందన్నారు. దేవాలయం చైర్మన్‌ రామారావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

 రేవూరులో హుండీ చోరీ..

మండలంలోని రేవూరులో వేణుగోపాలస్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్య క్తులు గురువారం రాత్రి హుండీలోని డబ్బులు చోరీకి చేశారు. ఎస్‌ఐ సీహెచ్‌ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం దేవాలయం ఉత్తరముఖ ద్వారం నుంచి గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి హుండీని పగులకొట్టి అందులో ఉన్న డబ్బులను పోయారు. ఆ దేవాలయ ఈవో శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  Follow Us on:
Advertisement