‘నన్ను క్షమించండి.. దేవుడు కూడా క్షమిస్తాడు’

ABN , First Publish Date - 2022-06-23T14:51:19+05:30 IST

ఆలయ హూండీలో చోరీ చేసిన అజ్ఞాత వ్యక్తి, మళ్లీ చోరీచేసిన నగదుతో పాటు హూండీలో వేసిన లేఖలో ‘నన్ను క్షమించండి.. దేవుడు కూడా క్షమిస్తాడు’ అని

‘నన్ను క్షమించండి.. దేవుడు కూడా క్షమిస్తాడు’

                 - ఆలయంలో చోరీ చేసి మళ్లీ అప్పగించిన అజ్ఞాత వ్యక్తి లేఖ


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 22: ఆలయ హూండీలో చోరీ చేసిన అజ్ఞాత వ్యక్తి, మళ్లీ చోరీచేసిన నగదుతో పాటు హూండీలో వేసిన లేఖలో ‘నన్ను క్షమించండి.. దేవుడు కూడా క్షమిస్తాడు’ అని రాసి ఉండడం ఆశ్చర్యం కలిగించింది. రాణిపేట జిల్లా లాలాపేట సమీపంలో కాంచనగిరి కొండ ఆలయంలో ఈనెల 17న రాత్రి ప్రవేశించిన వ్యక్తి హూండీ బద్దలుకొట్టి గదు చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి సిప్కాట్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో, హూండీలోని నగదును ఆలయ నిర్వాహకులు మంగళవారం లెక్కించగా అందులో లభించిన లేఖలో... నన్ను క్షమించండి, నేను చిత్రా పౌర్ణమి ముగిసిన కొన్ని రోజుల అనంతరం ఆలయ హూండీ పగులగొట్టి నగదు చోరీ చేశాను. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత లేకపోగా, కుటుంబంలోనూ సమస్యలు తలెత్తాయి. నేను హూండీలో చోరీచేసిన రూ.10 వేల నగదును మళ్లీ వేస్తున్నాను, నన్ను క్షమించండి, దేవుడు కూడా క్షమిస్తాడు’ అని రాసిన లేఖతో పాటు రూ.500 నోట్లతో కూడిన రూ.10 వేలు జతచేసి ఉంది.  

Updated Date - 2022-06-23T14:51:19+05:30 IST