అద్దంకిలో దొంగతనాల జోరు

ABN , First Publish Date - 2022-07-01T05:01:57+05:30 IST

అద్దంకిలో దొంగతనాలు పెరిగాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతు న్నారు.

అద్దంకిలో దొంగతనాల జోరు
రామాటాకీస్‌ బజారు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా

 పనిచేయని సీసీ  కెమెరాలు

ఆందోళన చెందుతున్న ప్రజలు

అద్దంకి, జూన్‌ 30:  అద్దంకిలో దొంగతనాలు పెరిగాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతు న్నారు. పట్టణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు కెమెరాలు పనిచేయక పోతుండటంతో దొంగతనాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దొంగతనాలు, అసాంఘి క శక్తుల దాడులు, కార్యకలాపాలు జరిగిన సమ యంలో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు  కీలకంగా ఉపయోగపడతాయి.  నాలుగైదు  సంవత్స రాల క్రితం అద్దంకిలో ప లు కీలకమైన ప్రాంతాలలో దాతల సహకారంతో అప్పటి పోలీస్‌ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఈ  సీసీ  కెమెరాల మానటరింగ్‌ ను అద్దంకి సర్కిల్‌ కార్యాల యంలో ఏర్పాటుచేశారు.  వీటి ఆధారంగా అప్పట్లో కొన్ని చోరీ లు, రోడ్డు ప్రమాదాలకు  సంబంధించిన కీలక ఆధా రాలను కూడా గుర్తించగలిగారు. 

అయితే, అనంతరం పలుచోట్ల సీసీ కెమెరాలకు సంబంధించిన కేబుల్‌ వైర్లు  తెగిపోవటం, వాటి ని ర్వహణ గురించి అనంతరం  వచ్చిన పోలీస్‌ అధికా రులు  పట్టించు కోకపోవటంతో మూలన పడ్డాయి. ప్రభుత్వం పలు  పట్టణాలలో పెద్దఎత్తున సీసీ  కె మెరాలు ఏర్పాటుచేసి మానటరింగ్‌, సీసీ ఫుటేజ్‌ జి ల్లా కేంద్రాలు, రాష్ట్ర కేంద్రంలోని పోలీస్‌ కార్యాల యాలకు అనుసంధానం చేశారు. పెద్దపెద్ద  సంఘ టనలు జరిగిన సమయంలో మాత్రమే సీసీ ఫుటేజ్‌ జిల్లా కేంద్రం లేదా రాజధానిలో ఉన్న కంట్రోల్‌ రూమ్‌ లో మాత్రమే  పరిశీలించే అవకాశం ఉంది. స్థానికంగా దాతల సహకారంతో ఏర్పాటు  చేసిన సీసీ  కెమెరాలు పనిచేయకపోవటంతో చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పరిశీలించి స్పం దించే అవకాశం లేకుండా  పోయింది. చోరీలు జరిగి న ప్రదేశం లేదా సమీపంలో  ఏదైనా  ప్రైవేట్‌ వ్యక్తు లు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి  ఏర్పడింది. 

అద్దంకి పట్టణంలో ఇటీవల కాలంలో తరచూ దొంగతనాలు  జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరా ల ఫుటేజ్‌ ఆవశ్యకతం ఎంతైనా ఉంది. పోలీస్‌ శాఖ అధ్వర్యంలో దాతల సహకారంతో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వినియోగంలోకి  తీసుకు రా వటంతో పాటు కొత్తగా అవసరమైన చోట దాతల సహకారంతో కొత్తగా ఏర్పాటుచేస్తే మరింత ప్రయో జనకరంగా ఉంటుందని పలువురు అభి ప్రాయప డుతున్నారు. ప్రధానంగా అద్దంకి పట్టణంలో గుండా నామ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఉండటంతో దొంగలు సులువు గా తప్పించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కూడలి ప్రాంతాలలో సీసీ కెమెరాల  ఏర్పా టుపై పోలీస్‌ అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-07-01T05:01:57+05:30 IST