కౌటాల, సిర్పూరు(టి) మండల కేంద్రాల్లో చోరీలు

ABN , First Publish Date - 2022-05-14T04:27:43+05:30 IST

మండల కేంద్రంలో గురువారం రాత్రి రెండిళ్లల్లో చోరీ జరిగింది. మండల కేంద్రంలోని ప్రగతి కాలనీకి చెందిన వర్ష, రజని అనే ఆరోగ్యశాఖలో పనిచేసే వారి ఇళ్లల్లో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

కౌటాల, సిర్పూరు(టి) మండల కేంద్రాల్లో చోరీలు
కౌటాలలో విచారణ చేపడుతున్న డీఎస్పీ కరుణాకర్‌

కౌటాల, మే 13: మండల కేంద్రంలో గురువారం రాత్రి రెండిళ్లల్లో చోరీ జరిగింది. మండల కేంద్రంలోని ప్రగతి కాలనీకి చెందిన వర్ష, రజని అనే ఆరోగ్యశాఖలో పనిచేసే వారి ఇళ్లల్లో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వర్ష స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు హైద రాబాద్‌లోని బెస్ట్‌ నర్సు అవార్డు రావడంతో ఆమె కుటుంబ సమేతంగా హైదరాబాద్‌ వెళ్లింది. అదే కాలనీలో నివాసం ఉండే ఏఎన్‌ఎం రజనీ ఇంట్లో కూడా దొంగలు చొరబడి దొంగతనానికి యత్నించారు. కాగారజని కుటుంబం శుభకార్యానికి హైదరాబాద్‌ వెళ్లారు. ఇది గమనించిన దొంగలు గురువారం రాత్రి రెండు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డారు. వర్ష ఇంటిలో బీరువాలోని 2తులాల బంగారం, రూ.1లక్ష నగదు ఎత్తు కెళ్లారు. రజని ఇంటిలో కొంత బంగారం ఎత్తుకెళ్లినట్లు వారు తెలిపారు. ఈమేరకు కౌటాల ఎస్సై మనోహర్‌ కేసు నమోదు చేసి ఫింగర్‌ ప్రింట్‌, జాగిలాలతో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కరుణాకర్‌ పరిశీలించారు.

సిర్పూరు(టి)లో..

సిర్పూరు(టి): మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి సమీపంలో గల తిరుపతి ఇంట్లో గురువారం రాత్రి చోరి జరిగినట్టు ఎస్సై ఎం రవికుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తిరుపతి కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 11న బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం ఇంటికి రాగా తలుపులు తీసి ఉండటం,ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. ఇంట్లో ఉన్న పది తులాల వెండి చోరికి గురైనట్టు వివరించారు. ఈ మేరకు తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ స్వామి, క్లూస్‌ టీం, డాగ్‌ స్వ్కాడ్‌తో తనిఖీ చేపట్టారు.

Read more