న‌గ‌దు కోసం... ఇక్కడ భారీ ‘క్యూ’లు..

ABN , First Publish Date - 2021-08-10T00:18:33+05:30 IST

మ‌య‌మ్మార్‌లో తీవ్ర‌మైన ఆర్ధిక సంక్షోభం నెల‌కొంది. ఆరు నెల‌ల క్రితం సైన్యం ఆధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఈ పరిస్థితి చోటుచేసుకుంది.

న‌గ‌దు కోసం... ఇక్కడ భారీ ‘క్యూ’లు..

టాంగూ : మ‌య‌మ్మార్‌లో తీవ్ర‌మైన ఆర్ధిక సంక్షోభం నెల‌కొంది.  ఆరు నెల‌ల క్రితం సైన్యం ఆధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఈ పరిస్థితి చోటుచేసుకుంది. సైన్యంపై ప్ర‌జ‌లుతిరుగుబాటు చేసిన నేపధన్యంలో... సైనిక ప్ర‌భుత్వం డిజిట‌ల్ లావాదేవీలను నిషేధించిన విషయం తెలిసిందే. ఇంట‌ర్నెట్‌ను డౌన్ చేసింది కూడా. ఇక ఈ క్రమంలో...  ఏటీఎంల వ‌ద్ద తెల్ల‌వారుజాము మూడు గంట‌ల నుంచే క్యూలు క‌డుతున్నారు.  ఏటీఎం ల‌లో నిత్యం న‌గ‌దును నింపుతున్న‌ప్ప‌టికీ స‌రిపోవ‌డంలేదు.  పైగా విత్‌డ్రా లిమిటేష‌న్ విధించ‌డంతో ఇబ్బందులు త‌లెత్తున్నాయి. మరోవైపు... డాల‌ర్‌తో మ‌య‌న్మార్ కరెన్సీ విలువ 20 శాతం ప‌డిపోయింది.  డిజిట‌ల్ చెల్లింపులు లేక‌పోవ‌డంతో కొంత‌మంది ఏజెంట్లు 10-20 శాతం క‌మీష‌న్ తీసుకొని డ‌బ్బులు ఇస్తున్నారు.  ప‌రిస్థితులు ఇలానే కొన‌సాగితే మ‌య‌న్మార్ ప్ర‌జ‌లు మ‌రింత ఇబ్బందులు ప‌డనున్నారన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.

Updated Date - 2021-08-10T00:18:33+05:30 IST