గుళ్లలోని loudspeakers కూడా తొలగించాలి: Raj Thackeray

ABN , First Publish Date - 2022-05-04T19:20:04+05:30 IST

ఇది కేవలం మసీదులకు సంబంధించిన విషయమై కాదు. కొన్ని గుళ్లల్లో కూడా చట్ట విరుద్ధంగా లౌడ్‌స్పీకర్లు ఉన్నాయి. నేను ఇప్పటికే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చాను. ఇది మత సంబంధమైన విషయం కాదు. సామాజిక సమస్య అని. రాష్ట్రంలో శాంతి కావాలని మేము కోరుకుంటున్నాం..

గుళ్లలోని loudspeakers కూడా తొలగించాలి: Raj Thackeray

ముంబై: loudspeakers అంశం మతానికి సంబంధించినది కాదని అది సామాజిక సమస్య అని MNS అధినేత Raj Thackeray మరోసారి స్పష్టం చేశారు. కొన్ని హిందూ దేవాలయాల్లో కూడా చట్ట విరుద్ధంగా లైడ్‌స్పీకర్లు నడుస్తున్నాయని వాటిని కూడా తొలగించాలని ఆయన అన్నారు. Maharashtra కొనసాగుతున్న ఈ లౌడ్‌స్పీకర్ల వివాదానికి ఆధ్యుడైన ఆయన.. ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసిన అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడారు.


‘‘ఇది కేవలం మసీదులకు సంబంధించిన విషయమై కాదు. కొన్ని గుళ్లల్లో కూడా చట్ట విరుద్ధంగా లౌడ్‌స్పీకర్లు ఉన్నాయి. నేను ఇప్పటికే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చాను. ఇది మత సంబంధమైన విషయం కాదు. సామాజిక సమస్య అని. రాష్ట్రంలో శాంతి కావాలని మేము కోరుకుంటున్నాం. Supreme Court నిబంధనలకు వ్యతిరేకంగా 135 మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. కానీ Police మాత్రమ మా (MNS) కార్యకర్తలపై చర్యలు తీసుకుంటున్నారు. మా Demand ఏంటంటే.. నిబంధనలకు విరుద్ధంగా మసీదుల వద్ద ఉన్న లౌడ్‌స్పీకర్లను తొలగించాలి. లేదంటే మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది’’ అని Raj Thackeray  అన్నారు.


దీనికి ముందు Bal Thackerayకు చెందిన ఒక వీడియోను Raj Thackeray తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్లపై నమాజ్‌ ఆగిపోతుంది. అభివృద్ధికి ఏ మతం అడ్డు కాకూడదు. హిందువుల ఆచార సంప్రదాయాలు అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఆ మతాన్ని కూడా పరిశీలిస్తాం. అలాగే మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్లు తొలగిస్తాం’’ అని ఆ వీడియోలో బాల్ థాకరే అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై కూడా మహారాష్ట్రలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Read more