రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2022-07-06T06:49:19+05:30 IST

రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ కరువు
బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న అనిత తదితరులు

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

ఎస్‌.రాయవరం, జూలై 5: రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని పెదఉప్పలం గ్రామంలో టీడీపీ శ్రేణులు నిర్వహిం చిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని, ఇందులో చాలా వరకు దళిత మహిళలే బాధితులని తెలి పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్‌, కార్యదర్శి లాలం కాశీనాయుడు, మాజీ ఎంపీపీ యేజర్ల వినోద్‌రాజు, టీడీపీ నాయ కులు ఎన్‌.వెంకటరాజు, అల్లు నర్సింహ మూర్తి, గుర్రం రామక్రిష్ణ, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు జ్యోతి, దత్తుడు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం అంధకారం

పరవాడ: వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లి పోయిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం రాత్రి గొర్లివానిపాలెం పంచాయతీ పరిధి బీసీ కాలనీ, దిబ్బలగొర్లివానిపాలెంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.  కాగడాలతో కాలనీలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బండారు మాట్లా డుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, పార్టీ నాయకులు అట్టా సన్యాసిఅప్పారావు, వియ్యపు చిన్నా, గొర్లి కనకారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T06:49:19+05:30 IST