హైవేలోకి ప్రవేశమార్గం లేనట్టేనా!

ABN , First Publish Date - 2022-09-24T05:21:50+05:30 IST

విజయవాడ - బెంగళూరు హైవేలో భాగంగా ముప్పవరం నుంచి కొడికొండ వరకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ ్నల్‌ ఇచ్చింది.

హైవేలోకి ప్రవేశమార్గం లేనట్టేనా!
మేదరమెట్ల-కొడికొండ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రూట్‌ మ్యాప్‌

13 చోట్ల మాత్రమే అవకాశం కల్పిస్తూ మ్యాప్‌ విడుదల

అద్దంకి ప్రాంత వాసులలో  ఒకింత నిరుత్సాహం

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు  కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

అద్దంకి, సెప్టెంబరు 23: విజయవాడ - బెంగళూరు హైవేలో భాగంగా ముప్పవరం నుంచి కొడికొండ వరకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ ్నల్‌ ఇచ్చింది. ఈక్రమంలో ఇప్పటికే సర్వే కూడా జరిగింది. భూ సేకరణకు కసరత్తు  చేస్తున్నారు. అయితే, 16వ నెంబరు జాతీ య రహదారిలో ముప్పవరం వద్ద నుంచి ప్రారంభమై ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతరపురం జిల్లాల గుండా కర్నాటక రాష్ట్రం సరిహద్దు కొడికొండ వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిలో కలవనుంది. 

ముప్పవరం నుండి కొడికొండ వరకు మొత్తం 332 కి.మీ దూరం కాగా 13 చోట్ల మా త్రమే గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవేలోకి ప్రవేశించేందుకు, బయటకు వచ్చేం దుకు ఇంటర్‌ చేంజ్‌ అవకాశం ఉంటుంది. ముప్ప వరం, తలమళ్ళ, కనిగిరి, చంద్రశేఖరపురం, పోరుమా మిళ్ళ, మైదుకూరు, ఎర్రగుంట్ల, గంగిరెడ్డిపల్లి, పులివెం దుల, మలకవేముల, నల్లమడ,  గోరంట్ల, కొడికొండల వద్ద మాత్రమే ఇంటర్‌ చేంజ్‌ రోడ్లను ఇచ్చారు. 

ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రారంభమయ్యే ముప్పవరం వద్ద ఇంటర్‌చేంజ్‌ 1 ఉంటుంది. ఆ తరువాత 2వ ఇంటర్‌ చేంజ్‌ ఒంగోలు-పొదిలి రోడ్డు క్రాస్‌అయ్యే తలమళ్ల వద్ద మాత్రమే  ఉంటుంది. అద్దంకి సమీపంలో నామ్‌ రోడ్డు క్రాస్‌ అయ్యే చోట ఎటువంటి ఇంటర్‌ చేంజ్‌ కు అవకాశం కల్పించలేదు. దీంతో అద్దంకి ప్రాంతం తో పాటు పల్నాడు జిల్లాలోని  వినుకొండ,  నర్సరావు పేట, మాచర్ల ప్రాంతాల నుంచి వచ్చే వాహన చోదకులు సుమారు 15 కి.మీ దూరంలోని ముప్పవరం వెళ్ళి బెంగళూరు హైవే ఎక్కాల్సి ఉంటుంది. అద్దంకి పట్టణానికి అత్యంత స మీపంలో గుండా హైవే వెళ్తున్నా ఇంటర్‌చేంజ్‌కు అవ కాశం లేకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవు తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతిని ధులు స్పందించి అద్దంకి వద్ద ఇంటర్‌ చేంజ్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అద్దంకి ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

రూ.16 వేల కోట్ల అంచనా వ్యయంతో  సుమారు 332  కి.మీ దూరం నిర్మించనున్న మేదరమెట్ల-కొడి కొండ గ్రీన్‌పీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేతో విజయవాడ-బెంగ ళూరు మధ్య  దగ్గర మార్గంగా ఉపయోగపడనుంది. అదే సమయంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలకు  ప్ర వేశం లేకపోవటంతో వాహనాలు వేగంగా ప్రయాణిం చే అవకాశం ఉంది. 28 చోట్ల మేజర్‌ బ్రిడ్జిలు, 299 మైనర్‌ బ్రిడ్జిలు నిర్మాణం చేయాల్సి ఉంది. 97 పైప్‌ కల్వర్టులు, 68  బాక్స్‌ కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. 45 వీయూపీ అండర్‌పాస్‌లు, 81ఎల్‌వీయూపీలు ని ర్మాణం చేయాల్సి ఉంది. 

Updated Date - 2022-09-24T05:21:50+05:30 IST