టీఆర్‌ఎస్‌ పాలనలో ఒరిగిందేమీ లేదు

ABN , First Publish Date - 2021-03-04T05:12:03+05:30 IST

ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర ప్రజ లకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో ఒరిగిందేమీ లేదు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి

- కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి

మక్తల్‌, మార్చి 3 : ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర ప్రజ లకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మక్తల్‌ పట్టణంలోని వెంకటేశ్వర గా ర్డెన్స్‌లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిం చగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లతో కలిసి చిన్నారెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసింది కాంగ్రెస్‌పార్టీ అని, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ పార్టీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ 37మంది ఎమ్మెల్యేలతో ఫోరంగా ఏర్పడి తెలంగాణ సాధనకోసం మొదట సంతకాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యార న్నారు. రూ.1.32లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామనడం అవాస్తవం అన్నారు. నాగేశ్వర్‌ గతంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైనా ప్రజలకు చేసిందేమీలేద న్నారు. అలాగే ఎమ్మెల్సీగా ఎన్నికైన రాంచందర్‌రావు కూడా ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి తెలం గాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని అన్నారు. అంతకు ముందు పట్టణంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రె స్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు శివకుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్ల కొత్వాల్‌, రాష్ట్ర నాయకులు మల్లురవి, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ వీరారెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు వి.శ్రీహరి, టీపీసీసీ అధికార ప్రతినిధి రాజుల ఆశిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గణేష్‌కుమార్‌, రవికుమార్‌, నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


నాలాగే చిన్నారెడ్డినీ ఆదరించండి : రేవంత్‌రెడ్డి

కోస్గి రూరల్‌ :  నన్ను ఆదరించినట్లే చిన్నారెడ్డిని హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్‌ప్రసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కోరారు. బుధవారం కోస్గి పట్టణంలోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడుసార్లు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోయిందని, ఇప్పుడు కూడా ఓడిపోతుందని అన్నారు. పీవీ నరసింహారావు కాంగ్రెస్‌వాది అని, అతని కూతురు టీఆర్‌లో చేరి ఎమ్మెల్సీగా పోటీ చేయడంతో పీ.వీ ఆత్మఘోషిస్తుందని అన్నారు. చిన్నారెడ్డిని గెలిసిస్తే పీ.వీ నరసింహారావు ఆత్మశాంతిస్తుందని అన్నారు. కొడంగల్‌ను దత్తత తీసుకున్న కేటీఆర్‌ చేసిన అభివృద్థి ఏమీ లేదని ఎద్దెవా చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించిన వెంటనే కేసీఆర్‌ను కలిసి లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని అడుగుతానని అన్నారు. లేని ఎడల ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు.  కొడంగల్‌ యువకుల ఉత్సాహం చూస్తుంటే కడుపు నిండిందన్నారు. గతంలో ఎమ్మెల్సీగా చేసిన రాంచందర్‌ ఒక్కసారి కూడా కోడంగల్‌ రలేదన్నారు. కార్యక్ర మంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివకుమార్‌, శివకుమార్‌,  మాధురెడ్డి, మాజి ఎమ్మెల్యే మల్లు రావి, తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు వార్ల విజయ్‌కుమార్‌, నాగులపల్లి నరేందర్‌, రాఘువర్ధన్‌ రెడ్డి,  కృష్ణంరాజు, గోవర్థన్‌ రెడ్డి, భానునాయక్‌, బేజు రాములు, తుడుమ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-04T05:12:03+05:30 IST