రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2022-07-04T05:07:58+05:30 IST

రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడస్తున్నా అభివృద్ధి మా త్రం శూన్యమైందని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురా లు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం
మాట్లాడుతున్న సత్యవతి


  డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి

అరసవల్లి, జూలై 3: రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడస్తున్నా అభివృద్ధి మా త్రం  శూన్యమైందని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురా లు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. నగరంలోని ఇంది రా విజ్ఞాన్‌ మందిరంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీజిల్‌ రేటు తగ్గినా కూడా సెస్‌ పేరిట రెండవ సారి ఆర్టీసీ చార్జీలను పెంచి ఈ ప్రభుత్వం పేదల, సామాన్యుల నడ్డి విరిచిం దని విమర్శించారు. పెంచిన బస్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని  డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీకి మద్ద తు ఇచ్చి కూడా ప్రత్యేక హోదాను సాధించుకోలేకపోయిందని  విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అత్యధిక ఎంపీ సీట్లు గెలిచినా ప్రత్యేక రాష్ట్ర హోదాను  సాధించలేకపోయిందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగానైనా రాష్ట్రంలోని పార్టీలు కలిసికట్టుగా ఉండి ప్రత్యేకహోదాపై  కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలోని అంశాలను సాధించుకోవడానికి ఇది చక్కని అవకాశ మని, దీనిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు.  కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు గోవింద మల్లిబాబు, సేవాదళ్‌ అధ్యక్షుడు పైడి నాగభూషణరావు, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురేష్‌, ఎస్సీ సెల్‌ నాయకులు కూరాకుల వెంకట రావు, లఖినేని సాయి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-04T05:07:58+05:30 IST