బలమైన విపక్షం ఉండాలి

ABN , First Publish Date - 2022-06-04T08:18:35+05:30 IST

దేశం లో బలమైన ప్రతిపక్షం ఉండాలని ప్ర ధాని మోదీ ఆకాంక్షించారు. వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శిస్తూ ఈ ధోరణి దేశంలోని ప్రతిభను చంపేస్తోందని పేర్కొన్నారు.

బలమైన విపక్షం ఉండాలి

వారసత్వ రాజకీయాలేమిటి?.. ప్రతిభను చంపేస్తున్నాయ్‌.. ముగింపు పలకాల్సిందే

అప్పుడే ఎవ్వరైనా రాష్ట్రపతి, 

ప్రధాని అవుతారు: మోదీ


కాన్పూర్‌, లఖ్‌నవూ, జూన్‌ 3: దేశం లో బలమైన ప్రతిపక్షం ఉండాలని ప్ర ధాని మోదీ ఆకాంక్షించారు. వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శిస్తూ ఈ ధోరణి దేశంలోని ప్రతిభను చంపేస్తోందని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు నెరుపుతున్న వారంతా ప్రస్తు తం తనకు వ్యతిరేకంగా జట్టు కడుతున్నారని అన్నా రు. అయితే ప్రస్తుతం దేశ ప్రజలు వారసత్వ రాజకీయాల జాడ్యాన్ని గుర్తించి ఆ నేతలను తరిమికొడుతున్నారన్నారు. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పూర్వీకుల గ్రామమైన యూపీలోని పరౌంఖ్‌ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. లఖ్‌నవూలో జరిగిన  ఉత్తరప్రదేశ్‌ మూడవ పెట్టుబడిదారుల సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. వారసత్వ రాజకీయాలకు అడ్డుకట్ట పడాలని స్పష్టం చేశారు. ఫలితంగా దేశంలో ఏ మారుమూల పల్లెలో పుట్టిన ఎవరైనా రాష్ట్రపతిగా, ప్రధానిగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. కాగా యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌతమ్‌ అదానీ, కుమార్‌ మంగళం బిర్లా తదితర ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్న పెట్టుబడుల సదుస్సులో  రూ.80వేల కోట్లకుపైగా విలువైన ఐటీ, సాగు, ఎలకా్ట్రనిక్స్‌కు సంబంధించిన 1,406 ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీ-20 ఆర్థిక దేశాల్లో భారత్‌ వేగంగా ఎదుగుతోందని  అన్నారు. ప్రపంచ సూచీలో ప్రస్తుతం భారత్‌ ద్వితీయ స్థానంలో ఉందని పేర్కొన్నారు. నిరుడు వందకుపైగా దేశాల నుంచి 84 బిలియన్‌ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. అదే సమయంలో రూ.30లక్షల కోట్లకుపైగా విలువైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మనదేశం రికార్డు సృష్టించిందని చెప్పారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-06-04T08:18:35+05:30 IST