పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి

ABN , First Publish Date - 2021-07-27T05:04:42+05:30 IST

పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులన్నీ నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ముగింపు దశలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు.

పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి

  పల్లె, పట్టణ ప్రగతిపై  సమీక్షలో కలెక్టర్‌

ఖమ్మంకలెక్టరేట్‌, జూలై26: పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులన్నీ నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ముగింపు దశలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని  కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం , మిషన్‌భగీరథ, సీఎం హామీ నిధులతో చేపట్టిన పనులను, నగరపాలక సంస్థ, సుడా పరిధిలోని లే అవుట్లు తదితర అంశాలపై సమీక్షించారు. పల్లెపట్టణ ప్రగతిలో చేపట్టిన పనులన్నీ ప్రజల ఉపయోగార్థం వినియోగంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో మిషన్‌భగీరథ నీరు ప్రతి ఇంటికీ చేరాలన్నారు.  హరిత హారం కింద నగరంలో సుందర వాతావరణం ఉండాలని ఈ పథకం కింద నాటిన మెక్కలన్నీ సజీవంగా ఉండేలా సంరక్షించాలన్నారు. గోళ్లపాడు చానల్‌ పనులు,. సీఎం హామీ కింద చేపట్టిన పనులన్నీ త్వరితగతిన పూర్తికావాలన్నారు. నగరంలో మెగా నర్సరీని ఏర్పాటుకు మునిసిపల్‌ కమీషనర్‌ అటవీశాఖ అధికారులు స్థలాన్ని గుర్తించాలన్నారు. 10నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో మెగా నర్సరీని ఏర్పాటు చేయాలన్నారు. సుడా పరిధిలోని లే అవుట్ల ఆడిట్‌ పకడ్బందిగా నిర్వహించాలని ఒరిజనల్‌ డాక్యుమెంట్ల ఆధారంగా భౌతిక స్వరూపం విస్తీర్ణం పరిశీలన చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.  సెగ్రిగేషన్‌ షెడ్స్‌, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు పల్లెప్రకృతి వనాలు నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్‌ అనురాగ్‌ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మెగిలి, డీపీవో వాసిరెడ్డి ప్రభాకర్‌, జిల్లా పరిషత్‌ సీఈవో కొండపల్లి శ్రీరామ్‌, డీఆర్డీవో విద్యాచందన తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T05:04:42+05:30 IST