లంచం అడిగే ఆస్కారం ఉండకూడదు : CM Jagan

ABN , First Publish Date - 2022-06-29T00:01:37+05:30 IST

అమరావతి: వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీ పథకం‌పై తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ మంత్రలు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.

లంచం అడిగే ఆస్కారం ఉండకూడదు : CM Jagan

అమరావతి:  వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీ పథకం‌పై తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ మంత్రలు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషెంట్‌కు ప్రత్యేక ఖాతా తెరవాలని ఆదేశించారు. ఆస్పత్రి నుంచి పేషెంట్‌ బయటకు వెళ్తున్నప్పుడు తనకు అందిన వైద్య సేవలపై అభిప్రాయం తీసుకోవాలన్నారు. అదనంగా రోగి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదని ఆరోగ్యమిత్రలు పేషెంట్‌ నుంచి కన్ఫర్మేషన్‌ తీసుకోవాలని సూచించారు. 108, 104, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లలో లంచాలకు ఆస్కారం ఉండకూడదన్నారు. లంచం అడిగే పరిస్థితులు లేకుండా ఎస్‌ఓపీలు ఉండాలని, లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న నంబర్లను ఆంబులెన్స్‌ల మీద రాసి ఉంచాలన్నారు. రిటైరయిన  వైద్యులు, ఆ రంగంలోని రిటైర్డ్‌ సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని కోరారు. జులై 26 నాటికల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఈ మార్పులన్ని కనిపించాలని జగన్ ఆదేశించారు. 

Updated Date - 2022-06-29T00:01:37+05:30 IST