అభివృద్ధి పనులపై నిఘా ఉండాలి

Jun 16 2021 @ 23:57PM
చిన్నదర్పల్లిలో బ్రిడ్జి పనులను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి

మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, జూన్‌ 16: అభివృద్ధి పనుల విషయంలో ప్రజలందరి భాగస్వామ్యంతో పాటు నిఘా ఉంచి నాణ్యతతో చేపట్టేలా చేసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పాలమూరు పురపాలిక పరిధిలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మునిసిపల్‌, ఆర్‌అండ్‌బీ శా ఖల ఆధ్వర్యంలో చేపట్టిన, చేపడుతున్న రూ.2.40 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. రూ.76 లక్షలతో చిన్నదర్పల్లిలో నిర్మించిన బ్రిడ్జిని ప్రారం భించారు. రూ.74 లక్షలతో నవాబ్‌పేట పీడబ్ల్యూ రోడ్డు నుంచి టంకర బీటీ రోడ్డు వరకు పనులను ప్రారంభించారు. 3వ వార్డులో 23 లక్షలు, 2వ వార్డులో రూ.20 లక్షలతో చేపడుతున్న అండర్‌ గ్రౌండ్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 8వ వార్డులో రూ.34 లక్షలతో చేపడుతున్న ఆర్‌సీసీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పైప్‌లైన్‌ పనులను, మునిసిపల్‌ కార్యాలయం సమీపంలో రూ.50 లక్షలతో చేపడుతున్న బ్రిడ్జీ పనులను, సత్యమన్న కాలనీలో రూ.35 లక్షలతో చేపడుతున్న బీటీ రెన్యూవల్‌ పనులను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరులో ఒక ప్రణాళిక ప్రకారం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేప డుతున్నామన్నారు. కాలనీ అసోసియేషన్‌, రిటైర్డ్‌ అధికారులు బాధ్యతగా తమ ఇంటి నిర్మాణం తరహాలో కాలనీలో జరిగే పనులపై నిఘా ఉంచి పనులు ఎలా చేపడుతున్నారో గమనించాలని కోరారు.  రైతులకు నిన్నటి నుంచే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. రైతులు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌, భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని కోరారు. పత్తి కంది పంటలకు ఎక్కువగా డిమాండ్‌ ఉన్నందున ఈ పంటలపై దృష్టి సారిస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, కౌన్సిలర్లు రామాంజనేయులు, కోరమోని వనజ, నీరజా విఠల్‌రెడ్డి, ఆర్డీఓ పద్మవ్రీ, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ పనుల పరిశీలన: నూతన కలెక్టరేట్‌ నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరిశీలించారు. పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.  హెలిప్యాడ్‌, సుందరీకరణ పనుల ను వీలైనంత త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. 

Follow Us on: