స్నేహితులు స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువతి.. అన్నింటినీ కలిపి ప్రియుడికి పంపడంతో.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-18T21:27:53+05:30 IST

కొందరు యువత చెడు స్నేహాలకు అలవాటు పడి.. చివరకు వివిధ నేరాలకు పాల్పడుతుంటారు. ఇటీవల యువతులు, విద్యార్థినులు కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం చూస్తూనే..

స్నేహితులు స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువతి.. అన్నింటినీ కలిపి ప్రియుడికి పంపడంతో.. చివరకు..

కొందరు యువత చెడు స్నేహాలకు అలవాటు పడి.. చివరకు వివిధ నేరాలకు పాల్పడుతుంటారు. ఇటీవల యువతులు, విద్యార్థినులు కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. తాగాజా, పంజాబ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. స్నేహితురాలే కదా అని విద్యార్థినులు ఆమె ఎదుటే స్నానం చేశారు. అయితే వారికి తెలీకుండా యువతి వీడియోలు తీసింది. చివరకు వాటిని అన్నింటినీ ప్రియుడికి పంపడంతో వీరి వ్యవహారం బయటపడింది. దీనిపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


పంజాబ్‌‌లో ఉన్న ఓ ప్రైవేట్ యూనివర్సిటీ (Punjab University) లేడీస్ హాస్టల్‌లో (Ladies Hostel) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హాస్టల్‌లో చాలా మంది విద్యార్థినులు ఉంటున్నారు. అయితే ఓ యువతి చేసిన నిర్వాకం వల్ల ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోటి విద్యార్థినులు స్నానం చేస్తున్న సమయంలో వారికి తెలీకుండా ఓ యువతి వీడియో (girls Bathing Videos) తీస్తూ వచ్చింది. స్నేహితురాలే కావడంతో ఆమె మీద ఎవరికీ అనుమానం రాలేదు. ఇలా వీడియోలు తీస్తూ.. వాటిని అన్నింటినీ తన ప్రియుడికి పంపుతూ వచ్చేది. అతను ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో (Viral videos) వైరల్ అయ్యాయి. శనివారం రాత్రి ఈ విషయం బయటికి తెలియడంతో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

షేవింగ్ పూర్తిగా చేశాక డబ్బులు ఇస్తానన్న కస్టమర్.. లేదు ఇప్పుడే ఇవ్వాలన్న బార్బర్.. చివరకు పని మధ్యలో ఆపేసి..


ఈ ఘటనపై బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఈ విషయం బయటికి తెలియడంతో హాస్టల్ వార్డెన్.. సదరు విద్యార్థిని గట్టిగా మందలించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై యూనివర్సిటీ  అధికారులు మాట్లాడుతూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని మొబైల్‌లో ఆమెకు సంబంధించిన వీడియో మాత్రమే ఉందని, దాన్ని మాత్రమే తన ప్రియుడికి పంపిందని చెబుతున్నారు. బాధిత విద్యార్థులు మాట్లాడుతూ, సుమారు 50, 60 వీడియోలను తన ప్రియుడికి పంపిందని, ఈ విషయంపై ఆమెను నిలదీయగా నేరం అంగీకరించడంతో పాటూ వీడియోలను డిలీట్ చేసిందని తెలిపారు.

భార్యకు పిల్లలు పుట్టలేదనే కారణంతో ఎదురింటి మహిళను చంపిన భర్త.. అందుకే ఇలా చేశానంటూ ఆ వ్యక్తి చెప్పింది విని..


ఇప్పటివరకూ వేరే అమ్మాయిలకు సంబంధించిన వీడియోల గురించి తమ దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann) స్పందిస్తూ.. యూనివర్సిటీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని, దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదంటూ స్పష్టం చేశారు. మరోవైపు పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ (State Commission for Women) కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. విచారణ జరుగుతోందని, నిందితులను విడిచిపెట్టేది లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు.. కమిషన్ చైర్‌పర్సన్ మనీషా గులాటి హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యువతిని కొట్టి, దుస్తులు ఊడదీసి మరీ వీడియో తీసిన యువకులు.. చివరకు జేసీబీలతో వెళ్లిన అధికారులు..



Updated Date - 2022-09-18T21:27:53+05:30 IST