జగన పాలనలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2022-08-11T05:12:50+05:30 IST

జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఆరాచకాలు తప్ప అభివృద్ధి లేదని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు.

జగన పాలనలో అభివృద్ధి శూన్యం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

 సభ్యత్వ నమోదు వేగవంతం చేయండి

టీడీపీ మండల  సమావేశంలో మాజీ మంత్రి పల్లె

నల్లమాడ, ఆగస్టు 10: జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఆరాచకాలు తప్ప అభివృద్ధి లేదని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు మైలే రామచంద్ర నివాసంలో వద్ద బుధవారం తెలుగుదేశం పార్టీ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లా డుతూ... టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని సూచించారు. సభ్యత్వం చేసినవారికి ప్రమాదం జరిగితే రూ.2లక్షలు బీమా వర్తిస్తుం దన్నారు. ఈ యేడాది అధికంగా సభ్యత్వాలు చేయాలని తెలిపారు. వైసీపీ అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. ప్రతి ఒక్కరికి రూ.50 ఇస్తున్నట్లు చెప్పి, రూ. 500 దోచుకుంటున్నారని అన్నారు. సంక్షేమపథకాలు అందిస్తున్నా మని ఆర్భాటం తప్ప అర్హులకు అందలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారేకానీ, రూపాయి నిధులు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. టీడీపీ పాలనలో అర్హులైనవారికి పింఛన్లు, రేషనకార్డులు, ఇళ్లు అందించామన్నారు. వైసీపీ ఇక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదన్నారు. పండుగల కానుకలు సరేసరి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలకన్వీనర్‌ మైలే శివశంకర్‌, మాజీ కన్వీనర్‌ కేశవరెడ్డి, మైలే రామచంద్ర, బి రమణారెడ్డి, మంజునాథ రెడ్డి,  సర్పంచ ప్రభాకర్‌రెడ్డి, వెంకటరమణనాయుడు, బుట్టి నాగభూషణ నాయుడు, గంగులప్పనాయుడు,పాపారాయుడు, కులశేఖర్‌నాయుడు, ప్రసాద్‌రెడ్డి, రాజారెడ్డి, లక్ష్మణ, శ్రీరాములు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T05:12:50+05:30 IST