69 జీవో అమలు చేస్తే భూత్పూర్‌ డ్యాం ఉండదు

ABN , First Publish Date - 2021-07-27T04:07:16+05:30 IST

రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్న ప్పుడు తెచ్చిన జీవో 69 అమలు చేస్తే భూత్పూర్‌ రిజర్వాయర్‌ ఉండదనే విషయం తెలుసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి అన్నారు.

69 జీవో అమలు చేస్తే భూత్పూర్‌ డ్యాం ఉండదు
కల్యాణలక్ష్మి చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చిట్టెం

ఎమ్మెల్యే చిట్టెం

ఊట్కూర్‌, జూలై 26 : రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్న ప్పుడు తెచ్చిన జీవో 69 అమలు చేస్తే భూత్పూర్‌ రిజర్వాయర్‌ ఉండదనే విషయం తెలుసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఊట్కూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన రేషన్‌ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయమ్మ చెరువుతోపాటు ఊట్కూర్‌ చెరువుకు నీళ్లు తీసుకొస్తానన్నారు. అనంతరం 260 కొత్త రేషన్‌ కార్డులను, 30 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులను అందజేశారు.

Updated Date - 2021-07-27T04:07:16+05:30 IST