ఉద్యోగం ఎంపికలో యువత చేసే 4 తప్పిదాలు.. అవగాహనతో మెలిగితేనే.. job satisfaction

ABN , First Publish Date - 2021-12-06T14:52:50+05:30 IST

నేటి యవతకు తమకు ఎటువంటి ఉద్యోగం కావాలో తెలుసు..

ఉద్యోగం ఎంపికలో యువత చేసే 4 తప్పిదాలు.. అవగాహనతో మెలిగితేనే.. job satisfaction

నేటి యవతకు తమకు ఎటువంటి ఉద్యోగం కావాలో తెలుసు.. అయినప్పటికీ చాలామంది సరైన ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? సాధారణంగా యువతీ యువకులు.. తాము ఉద్యోగం నుంచి ఏమి ఆశిస్తున్నరనే దానిపై చాలా స్పష్టతతో ఉంటారు. అయినప్పటికీ ఉద్యోగాన్ని ఎన్నుకునేటప్పుడు తొందపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. సాధారణంగా యువతీయువకులు ఉద్యోగం ఎంపిక విషయంలో చేసే 4 పొరపాట్లు ఇవేనని హార్వార్డ్ బిజినెస్ రివ్వ్యూ తెలియజేస్తోంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం..


డబ్బే ముఖ్యం అనుకోవడం

జీతం- ఉద్యోగంలో సంతృప్తి.. వీటి మధ్య ఎటువంటి సంబంధం లేదని ’హార్వార్డ్‘ పరిశోధకులు చెబుతున్నారు. ఏటా కోటి రూపాయలకుపైగా సంపాదించే లాయర్లు తమ ఉద్యోగంలో అసంతృప్తిగా ఉంటారు. లక్ష రూపాయలు సంపాదించే నర్సు తన ఉద్యోగ జీవితంలో ఎంతో సంతృప్తిగా ఉంటుంది. దీనిని పరిశీస్తే సంతృప్తి అనేది డబ్బులో లేదని, పనిలోనే ఉందని గ్రహించవచ్చు. మరోవైపు చాలామంది పని తగ్గించుకోవడానికి లేదా తమ మనసుకు నచ్చిన ఉద్యోగం చేసేందు కోసం ఆదాయాన్ని తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ, వారు సరైన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోలేకపోతుంటారు

తెలియని భయం కంటే తెలిసిన శత్రువు మేలు

ఉద్యోగం, కెరియర్ విషయానికి వస్తే.. ‘తెలియని భయం కంటే తెలిసిన శత్రువు మేలు’ అనే వ్యూహం ఆధారంగా పనిచేస్తుంటారని నిపుణులు చెబుతుంటారు. చాలామంది ఏళ్లతరబడి తమకు ఇష్టంలేని ఉద్యోగాలు చేస్తుంటారు. లేదా నచ్చని బాస్ కింద పని చేస్తుంటారు. అలాంటివారు భయంతోనే కాలం గడిపేస్తారు. కొత్తదనాన్ని కోరుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించరు. 


స్వీయ అవగాహన లోపం

చాలామంది యువతీ యువకులు తమలోని ప్రతిభను గుర్తించే ప్రయత్నం చేయరు. అయితే ఒకరికింద పనిచేయడానికి ఇష్టపడనివారు, సొంతంగా ఏదైనా పని చేయాలనుకునే వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఫలితంగా తక్కువ సంపాదనతోనే కాలం గడుపుతారు. వారు సంప్రదాయ ఉద్యోగం చేయడం లేదా ఇతరుల కోసం పని చేయడం ద్వారా మరింత విజయవంతంగా, సంతోషంగా ఉండవచ్చనే దానిని ఏమాత్రం అంగీకరించరు. 

అంచనాలు అర్థవంతంగా ఉండాలి

ఉద్యోగ నియామక ప్రక్రియలో సంబంధిత ఉద్యోగానికి తగిన వ్యక్తిని ఎంచుకోవడమనేది చాలా ముఖ్యం. అంటే దరఖాస్తుదారుకు తాను చేయాల్సి పని గురించి పరిజ్ఞానం ఉండాలి. మీరు చేయబోయే ఉద్యోగంపై మీకు అవాస్తవ అంచనాలు ఉంటే మీ కెరీర్‌లో ముందుకు సాగడం అసాధ్యం. సరైన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడంలో అంచనాలు అర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2021-12-06T14:52:50+05:30 IST