budget 5G phones: రూ.15 వేల లోపు మంచి 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా ?.. అయితే బెస్ట్ ఫోన్స్ ఇవే..

ABN , First Publish Date - 2022-09-28T22:19:07+05:30 IST

దేశంలో 5జీ సర్వీసులు (5G services) అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. దీపావళికి జియో 5జీ(Jio 5G) సేవలు ప్రారంభిస్తామని రిలయన్స్(RIL) అధినేత ముకేష్ అంబానీ(mukesh ambani) ఇదివరకే ప్రకటించారు.

budget 5G phones: రూ.15 వేల లోపు మంచి 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా ?.. అయితే బెస్ట్ ఫోన్స్ ఇవే..

దేశంలో 5జీ సర్వీసులు (5G services) అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. దీపావళికి జియో 5జీ (Jio 5G) సేవలు ప్రారంభిస్తామని రిలయన్స్(RIL) అధినేత ముకేష్ అంబానీ(mukesh ambani) ఇదివరకే ప్రకటించారు. ఇతర టెలికం కంపెనీలు కూడా 5జీ సేవలు అందించేందుకు సన్నద్ధమవుతున్నాయి. అయితే 5జీ సపోర్ట్ చేసే ఫోన్లు ఉన్నవారికి మాత్రమే ఈ సేవలు పొందే వీలుంటుంది. ఈ కారణంగానే దేశంలో 5జీ ఫోన్ల విక్రయాలు పెరుగుతున్నాయి. ఫెస్టివల్ సేల్స్‌ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్ (flipkart), అమెజాన్ (amazon) పలు 5జీ ఫోన్లు అందుబాటులో ఉంచాయి. ముఖ్యంగా రూ.15 వేల లోపు బడ్జెట్‌లో 5జీ ఫోన్లు కొనాలనుకునేవారికి కొన్ని ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫోన్లు ఏవీ, వాటి ఫీచర్లు ఏమిటో మీరూ ఓ లుక్కేయండి..


రూ.15 వేల లోపు బెస్ట్ ఇవీ..

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 5జీ

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 5జీ (Samsung Galaxy M13 5G) ఉంది. అమెజాన్‌పై లభ్యమవుతున్న ఈ ఫోన్అ ధిక సామర్థ్యమున్న బ్యాటరీ, చక్కటి డిస్‌ప్లేతో లభిస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 ఇంచ్ ఎల్‌సీడీ స్ర్కీన్‌తో హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో లభిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 15డబ్ల్యూ చార్జర్‌ బాక్స్‌ లభిస్తున్నాయి. బడ్జెట్‌లో కెమెరా పనితీరు కూడా బావుంది. Samsung Galaxy M13 5G అసలు ధర రూ.13,999 కాగా.. ప్రస్తుతం అమెజాన్‌పై డిస్కౌంట్‌తో రూ.11,999కి లభిస్తోంది. బ్యాంక్ కార్డ్, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.


రెడ్‌మీ నోట్ 11టీ 5జీ

బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G) ఒక బెస్ట్ ఆప్షన్. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 13 మాదిరిగానే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తోంది. ఛార్జర్ 33వాట్స్ ఛార్జర్, అధిక రిజల్యూషన్, రిఫ్రెష్ రేటుతో 6.6-ఇంచ్ స్ర్కీన్‌‌ ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో లభిస్తోంది. ఫోన్ డిజైన్ కూడా అప్‌డేట్‌గా ఉంది. కెమెరా క్వాలిటీ కూడా బావుంది. మెరుగైన ఆడియో ఔట్‌పుట్ కోసం స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ధర విషయానికి ఎంఐ.కామ్‌పై 64జీబీ స్టోరేజీ ఫోన్ రూ.14,999గా ఉంది. అయితే డిస్కౌంట్ సేల్స్‌లో అమెజాన్‌పై రూ.14,499కే 128జీబీ స్టోరేజీ మోడల్ అందుబాటులో ఉంది.


పోకో ఎం4 5జీ

5జీ ఫోన్ కోసం రూ.11 వేల కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించలేని వ్యక్తులు పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించవచ్చు. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్‌లో కెమెరా క్వాలిటీ కూడా బావుంది. 6.58- ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ స్ర్కీన్‌తో లభిస్తోంది. ధర విషయానికి వస్తే.. పోకో ఎం4 5జీ ఫ్లిప్‌కార్ట్‌పై రూ.10,999గా ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ మోడల్ ఫోన్ ఈ రేటులో లభిస్తోంది.


ఐక్యూఓఓ జెడ్6 లైట్ 5జీ

ఐక్యూఓఓ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) రూ.15 వేల లోపు ఉత్తమ  5జీ ఫోన్లలో ఇదొకటి. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 1 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఫీచర్లతో లభిస్తోంది. బడ్జెట్‌లో కెమెరా కూడా బావుంది. అమెజాన్‌పై ఈ ఫోన్ ధర రూ.15 వేలుగా ఉంది. ఆఫర్లతో కలిసి రూ.12,749కే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 


రియల్‌మీ 9ఐ 5జీ

మరోవైపు రియల్‌మీ 9ఐ 5జీ (realmi 9i) ఫోన్ రూ.14,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌పై ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.6-ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ 90హెచ్‌జెడ్ స్ర్కీన్, డైమెన్సిటీ 810 ఎస్‌వోసీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్స్ బ్యాటరీ, రేటుని బట్టి కెమెరా పనితీరు కూడా బావుంది. 

Updated Date - 2022-09-28T22:19:07+05:30 IST