ఇవి రైతులు పండించిన బొమ్మలు

ABN , First Publish Date - 2021-05-20T05:30:00+05:30 IST

ఈ చిత్రం చూస్తే పంట పొలాల్లో ఎవరో అందంగా బొమ్మలు గీసినట్టుగా ఉంది కదూ! కానీ అవి గీసిన బొమ్మలు కాదు. పంటను పండించిన రైతులే బొమ్మ వచ్చేలా పంటను రంగుల్లో పండించారు

ఇవి రైతులు పండించిన బొమ్మలు

ఈ చిత్రం చూస్తే పంట పొలాల్లో ఎవరో అందంగా  బొమ్మలు గీసినట్టుగా ఉంది  కదూ! కానీ అవి గీసిన బొమ్మలు కాదు. పంటను పండించిన రైతులే బొమ్మ వచ్చేలా పంటను రంగుల్లో పండించారు. వారి నైపణ్యం చూస్తే అభినందించకుండా ఉండలేం కదూ! 

  • జపాన్‌లోని కొన్ని గ్రామాల్లో పంట పొలాలు కనిపిస్తాయి. పంట పొలాల్లో బొమ్మలు కనిపించడం కోసం రకరకాల వంగడాలను ఎంచుకుంటారు.
  • మొనాలిసా వంటి బొమ్మలు, జపనీస్‌ చిహ్నాలను పంటపొలాల్లో కనిపించేలా పంటలు పండిస్తారు. వీటిని చూడటానికి ఏటా దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
  • పంటపొలాల్లో డిజైన్‌కు ముందు కంప్యూటర్‌లో ఎక్కడెక్కడ రంగుల వరి నాట్లు వేయాలో చూస్తారు. వాలంటీర్లు రంగు రంగుల వరి వంగడాలను ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తారు. 
  • ఇనకడేట్‌ ప్రాంతానికి జపాన్‌లో అత్యధికంగా వరి పండించే ప్రదేశంగా గుర్తింపు ఉండేది. అలాంటి చోట ప్రస్తుతం వరి పంట బాగా తగ్గిపోయింది. ఆదాయం తగ్గిపోవడంతో రైతులు ఈ మార్గంపై దృష్టిపెట్టారు. పర్యాటకుల వల్ల రైతులకు ఆదాయం సమకూరుతుండటంతో ఆర్ట్‌వర్క్‌ను కొనసాగిస్తున్నారు.

Updated Date - 2021-05-20T05:30:00+05:30 IST