UAE వెళ్తున్నారా? అయితే ఈ కొత్త మార్గదర్శకాలు తెలుసుకోండి..!

ABN , First Publish Date - 2022-02-12T15:21:18+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వెళ్లే ఆలోచన ఉంటే.. మీరు తప్పకుండా ఈ కొత్త మార్గదర్శకాలు తెలుసుకోవాల్సిందే.

UAE వెళ్తున్నారా? అయితే ఈ కొత్త మార్గదర్శకాలు తెలుసుకోండి..!

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వెళ్లే ఆలోచన ఉంటే.. మీరు తప్పకుండా ఈ కొత్త మార్గదర్శకాలు తెలుసుకోవాల్సిందే. లేనిపక్షంలో అక్కడికెళ్లిన తర్వాత సమస్యలు ఎదుర్కొవడం ఖాయం. కరోనా తర్వాత దాదాపు అన్ని దేశాలు తమ దేశానికి వచ్చే వారి కోసం పలు మార్పులు చేశాయి. వాటిలో ముఖ్యమైనవి కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్, క్వారంటైన్ లాంటివి. తాజాగా యూఏఈ ఈ మూడు విషయాలకు సంబంధించి విదేశీయుల కోసం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. 


దుబాయ్ వెళ్లేవారి కోసం..

దుబాయ్ వెళ్లేవారి కోసం 2022 జనవరి 27న యూఏఈ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ u.aeలో పూర్తి సమాచారం పొందురచడం జరిగింది. ఈ డేటా ప్రకారం రెసిడెన్సీ వీసా హోల్డర్లు మాత్రమే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) లేదా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసీపీ) అనుమతి లేకుండా దుబాయ్ వెళ్లొచ్చు. అదే బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల వారు తప్పనిసరిగా జీడీఆర్ఎఫ్ఏ, ఐసీపీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. 


మినహాయింపు..

పైన పేర్కొన్న దేశాలకు చెందిన కొంతమందికి మాత్రం జీడీఆర్ఎఫ్ఏ, ఐసీపీ ఆమోదం నుంచి మినహాయింపు ఉంది.

* కొత్తగా రెసిడెన్సీ, ఎంప్లాయిమెంట్ వీసా పొందినవారు

* షార్ట్ స్టే, లాంగ్ స్టే వీసాలు కలిగిన వారు

* పదేళ్ల కాలపరిమితి గల గోల్డెన్ వీసా ఉన్నవారు

* ఇన్వేస్టర్ లేదా పార్ట్నర్ వీసాదారులు

* విజిట్ వీసాపై వెళ్లిన వారు

* వీసా ఆన్ అరైవల్


బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల వారు దుబాయ్ వెళ్తే తప్పకుండా తీసుకెళ్లాల్సినవి ఏంటంటే..

* కోవిడ్-19 పీసీఆర్ టెస్టుకు సంబంధించిన నెగెటివ్ రిపోర్టు. అది కూడా ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్నది ఉండాలి. సర్టిఫికేట్‌పై క్యూఆర్ కోడ్‌ తప్పనిసరి.

* అలాగే డిపార్చర్ విమానాశ్రయంలో జర్నీనికి 6 గంటల ముందు టెస్టు చేయించుకున్న ర్యాపిడ్ పీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్. దానిపై తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఉండాలి.

Updated Date - 2022-02-12T15:21:18+05:30 IST