చాణక్య నీతి: ఈ సూత్రాలను పాటించే వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. ప్రతి పనిలో విజయమే!

ABN , First Publish Date - 2022-02-22T12:41:35+05:30 IST

మహా పండితుడు ఆచార్య చాణక్యుని మాటలు..

చాణక్య నీతి: ఈ సూత్రాలను పాటించే వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. ప్రతి పనిలో విజయమే!

మహా పండితుడు ఆచార్య చాణక్యుని మాటలు నాటి కాలంలో ఎంత ఆచరణయుక్తంగా ఉన్నాయో నేటికీ అంతే ఉపయోగకరంగా ఉన్నాయి. ఆయన రాసిన నీతి శాస్త్రంలో పలు జీవన విధానాలు ఉన్నాయి. వీటిని అనుసరించే వ్యక్తి జీవితంలో ఎదురు దెబ్బలు తినడు. అన్ని సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తాడు. ఇటువంటివారికి జీవితంలో సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే వారు చాణక్య నీతిని అనుసరించడం ద్వారా ఇబ్బందులకు దూరంగా ఉంటారు. చాణక్యుడు చెప్పిన ఆ అమూల్య విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. 

ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు 

కుబేరుడు కూడా తన ఆదాయానికి మించి ఖర్చు చేస్తే.. కొంతకాలం తర్వాత అతను కూడా పేదవాడు అవుతాడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. కాబట్టి మీ ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయండి. కష్ట సమయాలను ఊహించి ముందుగానే డబ్బును ఆదా చేయండి.


ఇతరుల తప్పుల నుండి నేర్చుకోండి 

తప్పులు చేస్తూ.. ఏదో నేర్చుకోవాలంటే మనిషి జీవితం చాలా చిన్నది. అందుకే ఇతరుల తప్పుల నుండి నేర్చుకోండి. మీ జీవితంలో అలాంటి తప్పులను పునరావృతం చేయవద్దు. 

మీ రహస్యాలు ఎవరికీ చెప్పకండి

మీరు ఏదైనా పెద్ద పనిని పూర్తి చేయాలనుకుంటే, దాని ప్రణాళికను రహస్యంగా ఉంచండి. మీ ఈ రహస్యాలను ఇతరులకు చెప్పకండి. మీరు విజయం సాధించినప్పుడు మీ చుట్టుపక్కలవారు దాని గురించి తెలుసుకుంటారు. 

ధైర్యాన్ని కోల్పోవద్దు 

మీరు ఏ పనిలో విఫలమైనా, మీ ధైర్యాన్ని కోల్పోకండి. ఎందుకంటే మన మనసే ఓటమికి, విజయానికి కారణం. ఓటమిని మనసులో అంగీకరించేవారిని ఎవరైనా సులభంగా ఓడిస్తారు.

ఈ 3 ప్రశ్నలను వేసుకోండి 

మీరు ఒక పనిని ప్రారంభించినప్పుడు లేదా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, ముందుగా మీలో మీరు 3 ప్రశ్నలను వేసుకోండి. నేను ఈ పనిని ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉంటుంది? ఈ ఉద్యోగం చేయగల సామర్థ్యం నాకు ఉందా?.. ఈ మూడు ప్రశ్నలకు మీకు సరైన సమాధానాలు లభిస్తే, ఖచ్చితంగా ఆ పనిని ప్రారంభించండి.  



Updated Date - 2022-02-22T12:41:35+05:30 IST