ఈ మ్యూచువల్ ఫండ్స్... దుమ్మురేపాయి...

ABN , First Publish Date - 2021-10-25T05:26:36+05:30 IST

గతేడాది మార్చి నుండి మార్కెట్ ర్యాలీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ప్రధానంగా లాభపడ్డాయి. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్‌లు కూడా అద్భుతమైన రాబడులను అందించాయి.

ఈ మ్యూచువల్ ఫండ్స్... దుమ్మురేపాయి...

హైదరాబాద్ : గతేడాది మార్చి నుండి మార్కెట్ ర్యాలీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ప్రధానంగా లాభపడ్డాయి. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్‌లు కూడా అద్భుతమైన రాబడులను అందించాయి. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గతేడాది కాలంలో కొన్ని ఫండ్స్ పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేశాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ప్రధానంగా విద్యుత్తు, నిర్మాణరంగం, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ విభాగాలలోని కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుంటాయి. కాగా... 


క్వాంట్ ఇన్ ఫ్రా ఫండ్ గడిచిన ఏడాది కాలంలో దాదాపు 118 శాతం రిటర్న్ ఇవ్వడం గమనార్హం. ఈ కేటగిరిలో టాప్ లో ఉంది. ఈ స్కీములో కార్పస్ ఫండ్ రూ. 85 కోట్ల వరకు ఉంది. ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గత సంవత్సరంలో 108.6 శాతం రాబడితో జాబితాలో రెండో స్థానంలో ఉంది. రూ .1,680 కోట్ల అసెట్ వాల్యూతో ఈ విభాగంలో అతిపెద్ద స్కీముగా ఉంది. పవర్, ఎనర్జీ, కన్ట్రక్షన్, ఫైనాన్షియల్ స్టాక్స్ ఫండ్ లో ఉంది. ఫండ్ ఆస్తుల్లో 61 శాతం లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేశారు.


 ఐడీఎఫ్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో ఇన్వెస్టర్లకు ఏడాదిలో 104.8 శాతం ప్రాఫిట్ ఇచ్చింది.  నిర్మాణం, సిమెంట్, విద్యుత్తు మరియు ఇంధన రంగాల్లోని సంస్థల్లో ఇన్వెస్ట్ చేసింది. ఇది రూ. 650 కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తుంది. 


హెచ్‌ఎస్‌బీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈక్విటీ ఫండ్... 

గత ఏడాది కాలంలో దాదాపు 102 శాతం రాబడిని అందించింది. ఇది రూ . 112 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. 


ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్...  

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గత ఏడాదిలో 97.4 శాతం రాబడితో ఇన్వెస్టర్లకు మంచి లబ్దిని చేకూర్చింది. రూ.  570 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నిర్మాణం, ఇంజనీరింగ్, ఎనర్జీ మరియు మెటల్ స్టాక్స్ ఉన్నాయి.

Updated Date - 2021-10-25T05:26:36+05:30 IST