వీటినీ శుభ్రం చేయాలి!

ABN , First Publish Date - 2022-01-04T05:30:00+05:30 IST

ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్నప్పుడు, అదనపు జాగ్రత్తలు పాటించడం

వీటినీ శుభ్రం చేయాలి!

ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్నప్పుడు, అదనపు జాగ్రత్తలు పాటించడం అవసరం. ఇందుకోసం చేతులతో పాటు వైరస్‌ అంటుకునే వీలుండే ప్రదేశాలను కూడా శానిటైజ్‌ చేస్తూ ఉండడం అవసరం. 

కారు స్టీరింగ్‌: కారు స్టీరింగ్‌కు దగ్గరగా ఉండే ముక్కు, నోటి ద్వారా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కారునే ప్రధాన ప్రయాణ సాధనంగా వాడేవాళ్లు, ప్రతి రోజూ స్టీరింగ్‌ను శానిటైజ్‌ చేయడం మర్చిపోకూడదు.

హెడ్‌ఫోన్స్‌: రోజులో ఎక్కువ సమయం హెడ్‌ఫోన్లతో గడిపే మనం వాటిని శానిటైజ్‌ చేయాలనే విషయం మర్చిపోతూ ఉంటాం. కొవిడ్‌ వైరస్‌ ఉపరితలాల మీద గంటలతరబడి సజీవంగా ఉంటుంది. కాబట్టి హెడ్‌ఫోన్లను కూడా ప్రతిరోజూ శానిటైజ్‌ చేయడం అవసరం.

టి.వి, ఎ.సి రిమోట్లు: రోజులో అత్యంత తరచుగా, ఎక్కువగా తాకే వీలున్న వస్తువులు ఇవి. తేమ సోకితే పాడయ్యే వీలున్న పరికరాలు కావడంతో, వీటిని అలాగే వదిలేస్తూ ఉంటాం. కానీ తలుపు గడియలు శుభ్రం చేసినట్టే, తరచుగా తాకే వీలున్న రిమోట్లను కూడా శానిటైజ్‌ చేయడం అవసరం.

దిండ్లు: సాధారణంగా దుప్పట్లు, దిండు కవర్లను ఉతికేస్తూ ఉంటాం. కానీ దిండ్లలో కూడా దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ పేరుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటిని శుభ్రం చేయడమూ అవసరమే! ఎక్కువ శాతం దిండ్లు వాషింగ్‌ మిషన్‌లో ఉతికేయడానికి వీలున్నవే కాబట్టి, వాటినీ దుప్పట్లతో పాటు ఉతికేస్తూ ఉండండి.

స్విచ్‌బోర్డులు: వీటిని ఇంటిల్లిపాదీ ప్రతి రోజూ తాకుతూ ఉంటాం. కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్టే, వీటినీ శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఇంటి బయట ఉండే కాలింగ్‌ బెల్‌ను పనివాళ్ల మొదలు, పలువురు తాకుతూ ఉంటారు. కాబట్టి దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం శానిటైజర్‌తో కాలింగ్‌బెల్‌ శుభ్రం చేసుకోవాలి.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు: డబ్బుతో పనిలేని లావాదేవీలు జరుపుతున్నాం. అయితే బదులుగా ఉపయోగిస్తున్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు చేతులు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో వైరస్‌ వాటి మీద చేరుకునే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వాటినీ శానటైజ్‌ చేసుకోవాలి.


Updated Date - 2022-01-04T05:30:00+05:30 IST