ఈ ఫొటోలోని పామును ఎన్ని కోట్లకు అమ్మబోయారో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

Jul 19 2021 @ 21:07PM

ఇంటర్నెట్ డెస్క్: ఫొటోలో కనిపిస్తున్న పామును కొందరు దుండగులు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి పెట్టారట. దీని ధర వాళ్లు ఎంత చెప్పారో తెలుసా? కనీసం రూ.2.5కోట్లు. ఎందుకంటే ఇది చాలా అరుదైన రెడ్ శాండ్ బోవా స్నేక్ అట. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో రహస్యంగా అమ్మడానికి ప్రయత్నించిన కొందరు దుండగులను తాజాగా ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. లఖీంపూర్‌ఖేరీ ప్రాంతానికి చెందిన ఈ దొంగలు.. దుధ్వా టైగర్ రిజర్వ్ సమీపంలో ఈ పామును అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా కొందరు స్మగ్లర్లు అరుదైన పామును అమ్మకానికి పెట్టినట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.


పామును అమ్మకానికి పెట్టిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు కేజీల బరువున్న అరుదైన రెడ్ శాండ్ బోవా రకం పాము మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన దొంగలు షాకింగ్ నిజాలు వెల్లడించారు. తాము ఇంతకు ముందు కూడా ఇలాంటి పనులే చేసేవారిమని చెప్పిన దొంగలు.. ఇప్పటి వరకూ కనీసం 6 పాములను ఇలా అంతర్జాతీయ మార్కెట్లో అమ్మేసినట్లు తెలిపారు. దుధ్వా టైగర్ రిజర్వ్ సమీపంలో ఈ పాములు కనిపిస్తాయట. దీన్నే అదనుగా తీసుకున్న దొంగలు ఇక్కడ పాములు పట్టి అమ్మడం ప్రారంభించారు. వీరిపై వైల్డ్‌లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదైంది.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...